ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పెదవులపైనా మెరిసే ఈ నవ్వులే
ఇది వరకైతే ఎపుడు కనిపించలే
ఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే
ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నే నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం
అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
పని తెలియని పసితమట నాది
అది తెలిసిన పెద మనసట నీది
అనువుగ మరి జరగదు కద ఏది
అనుకువగల మగువకు తిరుగేదీ
నీ వలనే అవుతుందేమో నేనెపుడూ కోరే పని
నీ జతగా ఉండె గుండె అంటుందే ఇంతే చాలని
వందేళ్ళీ వర్ణాలన్నీ తోడుండనీ
ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నా నీ నీక్షణం
అంతో ఇంతో వింతే నీతో సాగే సహజీవనం
అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే
అవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందే
Like and Share
+1
+1
+1