Menu Close

Thalli Pegu Song Lyrics In Telugu – Narappa

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక… ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఆఆ
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా

రాకాసి చీకటిలో… ఏ కీడు తాకిందో
ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్ళేర్రా చేసి రేయిని చూడయ్యా, ఆఆ
తెల్లారి సూరిడల్లే రావయ్యా

నీ సెమట తడి ఇంకా ఇంకనేలేదయ్యా
ఈ తోటనంతా తడిమి సూడయ్యా
నీ నవ్వు సడి లేక… గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా, ఆఆ
మట్టిని చీల్చుకొచ్చే… విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే… సత్తువ నీదయ్యా, ఆ ఆ
అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా, ఆ ఆ
ఇట్టేనెట్టి సప్పునా ఇంటికి రావయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా

కన్నొదిలి చూపెల్లీ మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా, ఆ
నన్నొదిలి నువ్వెళ్ళి… కోడి కట్టి ప్రాణాలే
నా ఆశకాయువింకా… ఇంకా మిగేలేరా
కటిక నిజం నీదని… ఏ రుజువెదురవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చూడయ్యా, ఆ
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా

తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆ
నన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక… ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా, ఆఆ
ఇంతలోనే ఏమయ్యావో సెప్పయ్యా

రాకాసి చీకటిలో… ఏ కీడు తాకిందో
ఏకాకివై పోయావా చంద్రయ్యా, ఆ ఆ
కళ్ళేర్రా చేసి రేయిని చూడయ్యా, ఆఆ
తెల్లారి సూరిడల్లే రావయ్యా

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading