అదిరింది మామ అదిరిందిరో… ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిరో
అదిరింది పిల్లా అదిరిందిలే… కుదిరింది పెళ్లి కుదిరిందిలే
ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టి
వయసుపోరు తీరాలిలే… వలపు జోరు తేలాలిలే
ఆకులిస్తా పోకలిస్తా… కొరికి చూడు ఒక్కసారి
ఆశలన్నీ వరసపెట్టి… తన్నుకొచ్చి గిల్లుతాయి
బుగ్గమీద పంటిగాటు… పడుతుంది ప్రతిసారి
సిగ్గు చీర తొలిగిపోయి… నలుగుతుంది తొలిసారి
మాపటేల మేలుకున్న… కళ్ళ ఎరుపు తెల్లవారి
మామ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ
ఒకసారి కసిపూడితే… మరుసారి మతిచెడితే
ఆ..! వయసు పోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిలే
అదిరింది పిల్లా అదిరిందిలే… కుదిరింది పెళ్లి కుదిరిందిలే
ఉడుకుపుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టి, హ
వయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిలే
పూల పక్కా ముళ్ళలాగా… మారుతుంది ఎప్పుడంట
పూలుకున్న కౌగిలింత… సడలిపోతే తప్పదంట
మొదటిరేయీ పెట్టుబడికి… గిట్టుబాటు ఎప్పుడంట
మూడునాళ్ళ ముచ్చటంత… డస్సి పోతే గిట్టదంట
రేయి రేయి మొదటి రేయి… కావాలంటే ఏట్టాగంటా
సూర్యుడొచ్చి తలుపు తడితే… తీయకుంటే చాలంటా
తొలి రేయి గిలి పుడితే… తుది రేయి కలబడితే
హా..! వయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిలే
అదిరింది మామ అదిరిందిరో… ముదిరింది ప్రేమ ముదిరిందిరో
ఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టి, హ
వయసుపోరు తీరాలిలే… వలపు జోరు తేలాలిరో
తాన నానా తానాననా… తాన నానా తానాననా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.