ఆ ఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం… అందుకోనా
ఆదమరిచి కలకాలం… ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వాన జల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికేనా
పిల్లగాలే పల్లకీగా… దిక్కులన్నీ చుట్టిరానా
నా కోసం నవరాగాలే… నాట్యమాడెనుగ
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం… అందుకోనా
ఆదమరిచి కలకాలం… ఉండిపోనా
స్వర్గాల స్వాగతాలు… తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చె తారలెన్నో… మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీలే సోయగాన… చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే… వేచి నిలిచెనుగ
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూసిన పొదరిల్లూ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.