ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Interesting Telugu Stories
“మిమ్మల్ని బాగా చదివించడం నా బాధ్యత. అందుకే మిమ్మల్ని యూనివర్సిటీకి పంపిస్తున్నాను. దీనికి మీరు నాకేం చెల్లించనవసరం లేదు. నేను మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు నా చిన్న కోరిక తీర్చండి, చాలు. నా మరణానంతరం నా శవ పేటికలో ఒక్కొక్కరు ₹1000/- చొప్పున పెట్టండి చాలు” అని తన ముగ్గురు కొడుకులకు చెప్పాడు.
చదువుల తరవాత ఒకడు డాక్టర్, రెండోవాడు లాయర్, మూడోవాడు ఆర్థిక నిపుణుడు అయ్యారు. కొంత కాలానికి తండ్రి మరణించాడు. పిల్లలకు తండ్రి కోరిక గుర్తు వచ్చింది. మొదట డాక్టర్ పది ₹100/- నోట్లు శవపేటికలో వేసాడు. రెండో వాడు ఆర్థిక నిపుణుడు కూడా ₹1000/- శవపేటికలో ఉంచాడు. చివరికి గుండెలవిసేలా రోదిస్తున్న లాయర్ వంతు వచ్చింది. లాయర్ కోటు జేబులో నుంచి చెక్ బుక్ తీసి ₹3000/- చెక్ రాసి శవపేటికలో పెట్టి సోదరులిద్దరూ పెట్టిన ₹2000/- తీసుకుని జేబులో పెట్టుకొన్నాడు.
సేకరణ – V V S Prasad