Intelligent Telugu Stories - నాలుగు విషయాల పట్ల జ్ఞానబోధ - Telugu Bucket
Menu Close

Intelligent Telugu Stories – నాలుగు విషయాల పట్ల జ్ఞానబోధ

Intelligent Telugu Stories

రాజు గారి తోటలో ఒక చిన్న పక్షి రుచిగా వుండే పళ్ళు తిని పోయేది . రాజు ఆ పక్షిని పట్టుకోవాలని, దాక్కున్నాడు. రోజులాగానే పక్షి వచ్చింది. అదను చూసి గభాల్న పక్షిని పట్టుకున్నాడు. పక్షి తప్పించుకునే ప్రయత్నించింది. కానీ రాజు వదలలేదు. అప్పుడు పక్షి రాజుతో, “నన్ను ఒదిలి పెడితే మీకు నాలుగు విషయాల పట్ల జ్ఞానబోధ చేస్తాను” “ముందు అవేమిటో చెప్పు, నిన్ను ఏం చేయాలా చూస్తాను”

పక్షి: “1. నీ చేతికి చిక్కిన శత్రువును ఒదిలి పెట్టవద్దు”
రాజు: “సరే తరవాతది?”
పక్షి:”2, అసాధ్యం అని దేన్నీ అనుకోవద్దు.”
రాజు:3. “మూడోది?”
పక్షి: “జరిగిపోయిన దాని గురించి చింతించొద్దు.”
రాజు: ” నాలుగోది?”

bird telugu stories

పక్షి: నాలుగోది క్లిష్టమైనది. నేను చెప్తాను గానీ, నీ పిడికిట్లో ఊపిరాడకుండా ఉంది. కొంచెం సడలించు, చెప్తాను, రాజు పట్టు సడలించాడు. పక్షి తప్పించుకుని చెట్టు పైన కూర్చుంది. ఉలిక్కిపడ్డాడు రాజు. పైనున్న పక్షి, “నాలుగోది క్లిష్టమైనది అంటే నమ్మేసావు. విషయ పరిజ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన చాలదు. ఆచరణలో పెట్టాలి. కొద్ది సేపటి క్రితం జ్ఞానానికి సంబంధించిన మూడు విషయాలు చెప్పాను. అది విని కూడా నిర్లక్ష్యం చేసావు.
చేతికి చిక్కిన శత్రువును ఒదలవద్దన్నాను, కానీ నన్ను వదిలేసావు.

అసాధ్యం అని దేన్నీ అనుకోవద్దన్నాను. నాలుగో విషయం క్లిష్టమైనది అంటే నమ్మేసావు.
జరిగిపోయిన దాని గురించి చింతించొద్దన్నాను. నన్ను వదిలినందుకు ఇంకా బాధ పడుతున్నావు. అంటూ పక్షి తుర్రుమంది.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories, Motivational Telugu Stories

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading