ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
“అమ్మకానికి కుక్కపిల్లలు” అనే షాపు లోకి వెళ్లి, “కుక్క పిల్లల ధర ఎంత??” అని అడిగాడు. “ఒక్కొక్కటి 2000 నుండి 5000 రూ.” ఆ పిల్లవాడు, తను దాచుకున్న చిల్లర డబ్బులు తీసి, లెక్క పెట్టి, “నా దగ్గర 197 రు. ఉన్నాయి. నేను కుక్క పిల్లలను చూడవచ్చా” షాపు యజమాని చిరునవ్వుతో ఒక ఈల వేశాడు.
లోపలినుండి అయిదారు కుక్కపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందులో ఒకటి కుంటుకుంటూ దేక్కుంటూ అన్నిటి కన్నా వెనక వచ్చింది. ఆ పిల్లవాడు అడిగాడు, “ఈ కుక్క పిల్లకు ఏమైంది?” షాపు యజమాని, “దాని తుంటి ఎముకలు దెబ్బతిన్నాయి. అది ఇంకెప్పటికీ సరిగా నడవలేదు. పరిగెత్త లేదు.”
ఆ బాలుడు ఉత్సాహంగా, “ఆ కుక్కపిల్ల నాకు కావాలి.” షాపు యజమాని, “ఆ కుక్కపిల్లను నువ్వు కొనుక్కోనవసరం లేదు. ఉచితంగా ఇచ్చేస్తాను.” “నాకేం ఊరికే వద్దు. అది మిగిలిన కుక్క పిల్లలకు ఏ విధంగానూ తీసిపోదు. ఇప్పుడు ఈ 197రు.లు తీసుకోండి. మిగిలిన నెలకు 100 రు.ల చొప్పున ఇస్తాను.” “నిజంగానే ఆ కుక్కపిల్ల కావాలా!! అది పరిగెత్త లేదు!! నడవలేదు!! నీతో ఆడుకోలేదు..”
“అయినా పర్వాలేదు” అని ఆ బాలుడు ఒకవైపున కాలి ప్యాంటుని పైకెత్తి తన స్టీల్ రాడ్ తో ఉన్న కుంటి కాలుని చూపించాడు షాపు యజమానికి, “నేను కూడా పరిగెత్తలేను. నేను ఆడలేను. ఆ కుక్క పిల్ల కూడా తనను అర్థం చేసుకునే వాళ్ళు కావాలని కోరుకుంటోంది.”
వైకల్యాన్ని అర్థం చేసుకోలేక పోవడమే నిజమైన దౌర్బల్యం.
సేకరణ – V V S Prasad