అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఆ తృప్తి మరెందులోనూ లేదు – Moral Stories in Telugu – మోరల్ స్టోరీస్
యుక్త వయసులో వున్న నలుగురు అన్నదమ్ములు.
పొలం పనులకి వెల్లి మద్యానానికి బోజనానికి
ఇంటికి వచ్చే వారు.
పెద్దన్న భోజనం చెయ్యడానికి వచ్చి
నా తరవాత ఇంకా ముగ్గురు తినాలి అని
కొంచెం తిని మిగతాది తరువాత తమ్ముళ్ళకి వుంచి పనికి వెళ్ళిపోతాడు.
ఆ తరవాత రెండో తమ్ముడు కూడా వచ్చి
తాను కూడా నేను తిన్నాక ఇంకా ముగ్గురు తినాలి అనుకుని
కొంచెం తిని వెళ్తాడు..
అలానే మిగిలిన తమ్ముళ్లు కూడా చేస్తారు..
నలుగురు తిన్నాక కూడా ఇంకా ఆ కుండలో చాలా మిగిలి వుంటుంది.
ఆ మిగిలిన అన్నాన్ని వారి తల్లి పని ఆవిడకి ఇస్తుంది,
ఆవిడ ఆ అన్నాన్ని ఇంటికి తీసుకువెళ్ళి
తన బిడ్డలకు కొంచెం కొంచెం పెట్టి
ఒక ముద్ద తన తాగుబోతు మొగుడుకి వుంచుతుంది.
నిజానికి అది గట్టిగా తింటే ఒక్కరికీ సరిపోతుంది.
కానీ ఇంతమంది ఎలా తినగలిగారు.. అంటే..
ప్రేమగా పంచుకునే మనసు వుండాలే కానీ
ఏదీ సరిపోకపోవడం అంటూ వుండదు..
మనకి ఆనందంగా నలుగురితో పంచుకోవడం రావాలి.
అందులో వుండే తృప్తి మరేందులోనూ లేదు..
గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ – Game Changer Movie Review in Telugu – 2025