భర్తకి కొద్ది రోజులగా అనుమానం తన భార్యకి వినికిడి సమస్య వచ్చిందేమోనని.
భార్యని అడగడానికి ధైర్యం సరిపోక , డాక్టర్ని సంప్రదించాడు…
డాక్టర్ : “ఒక పని చేయండి, ఈరోజు ఒక 40 అడుగుల దూరం నుంచి మీ భార్యని పిలవండి, తను స్పందించకపోతే కొద్దిగా ముందుకెళ్లి పిలవండి.. ఇలా దూరం తగ్గిస్తూ పిలవండి, మీ అనుమానం తీరుతుంది.”
ఇంటికి వెళ్లి డాక్టర్ చెప్పినట్టు చేసాడు..మొదట 40 అడుగుల నుంచి ” ఏమోయ్, ఈ రోజు ఏం కూర చేసావ్, సమాధానం రాలేదు.”
ఈ సారి, కాస్త దగ్గరగా వంట గది బయట నుంచుని ” ఏమోయ్ ఈ రోజు ఏం కూర చేసావ్”.. ఉహు సమాధానం రాలేదు”
ఈసారి, భార్య వెనకనే నుంచుని ” ఏమోయ్, ఈ రోజు ఏంకూర చేసావ్.”
భార్య : ఇప్పటికి 3 సార్లు చెప్పా , వంకాయ కూర చేసానని.
అర్ధమైనవాళ్లకి అర్ధమయినంత 😋😆😂😉😁
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.