మనిషికి ఏమయింది?
ఎప్పుడైనా.. ఒక కుక్క మరో కుక్కని చంపడం చూశావా?
నిజమే, అవి ఒక్కోసారి ఘర్షణ పడుతుంటాయి,
అది కేవలం ఘర్షణ అంతే.
ఒక కుక్క ఎప్పుడూ మరో కుక్కని చంపలేదు.
ఏ కాకీ మరో కాకిని దేన్నీ చంపలేదు.
ఏ సింహమూ మరో సింహాన్ని చంపలేదు.
జంతువులన్నిటిలో మనిషొక్కడే సాటి మనిషిని చంపుతాడు.
తన వారినే చంపుకునే.. జంతు తెగ మనిషిదే.
మనిషికి ఏమయింది?
జంతువుల కంటే అథమ స్థాయికి పతనమయ్యాడా?
దీనికి, ఎవరు బాధ్యులు?
జంతువుల్లో లోపించినది ఒక అంశమే.
వాటిలో ప్రవక్తలూ లేరు, నీతివేత్తలూ లేరు.
క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు, జైనులు లేరు.
వాటికి ఆలయాలు లేవు, మసీదులు లేవు,
బైబిళ్లు, వేదాలు లేవు, అంతే. అదే తేడా.
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.