అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
డీప్‌సీక్ అంటే ఏమిటి – 51 లక్షల కోట్లను ఆవిరి చేసిన 51 కోట్ల యాప్ – What is DeepSeek in Telugu
Tech News in Telugu: What is DeepSeek, Detailed explanation?
- కృత్రిమ మేధ రంగంలో కొత్త సంచలనాలు
- ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు చాలెంజ్
- 51 లక్షల కోట్లను ఆవిరి చేసిన 51 కోట్ల యాప్

డీప్‌సీక్ అనేది చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప కంపెనీ. దీన్ని 2023లో లియాంగ్ వెన్‌ఫెంగ్ స్థాపించారు. డీప్‌సీక్ ఆర్1 (DeepSeek-R1) పేరుతో ఓపెన్ సోర్స్ AI మోడల్‌ను విడుదల చేసారు.
ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ మోడల్ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న అప్స్ , యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని కంటే మెరుగైన స్తానం లో ఉంది. డీప్‌సీక్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది తక్కువ డేటా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పెర్ఫార్మన్స్ అందిస్తుంది.
చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో పోలిస్తే ప్రతీఒక్కరూ డీప్‌సీక్‌కు ఆకర్షితులు కావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి దీని తయారీకి ఖర్చయిన సొమ్ము మిగతా చాట్‌బాట్‌లపై చేసిన వ్యయంలో 50 రెట్లు తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. డీప్‌సీక్ మోడల్‌కు శిక్షణ ఇచ్చేందుకు తక్కువ సామర్థ్యం కలిగిన ఎన్విడియా హెచ్ 800 చిప్‌లను వాడారు. దీంతో యాప్ తయారీ, సేవల వ్యయం భారీగా తగ్గిపోయింది.
మిగతా చాట్‌బాట్‌లు యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ల పేరిట కొంత రుసుమును వసూలు చేస్తుండగా ‘డీప్‌సీక్’ యాప్ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధిక డౌన్‌లోడ్‌లు సాధించిన యాప్‌గా ‘డీప్‌సీక్’ నిలిచింది. చైనాకు చెందిన ఐటీ ఇంజినీర్ లియాంగ్ వెన్‌ఫెంగ్ ‘డీప్‌సీక్’ సంస్థకు వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
డీప్‌సీక్ యొక్క విజయంతో, టెక్ రంగంలో ఉన్న పెద్ద కంపెనీలు తమ స్ట్రాటెజిలను పునఃపరిశీలించాల్సి వస్తోంది. ఇది చైనా కంపెనీ కావడంతో భద్రతా అంశాలపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి.
డీప్‌సీక్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘డీప్‌సీక్ ఆవిష్కరించిన ఆర్1 మోడల్ ఆకట్టుకొంటున్నది. తక్కువ ధరకు ఈ సేవలు ఇవ్వడం విశేషం. త్వరలోనే మేమూ మెరుగైన మోడల్ తీసుకొస్తాం’ అని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ‘డీప్‌సీక్’ ఓ మేల్కొలుపు అంటూ అమెరికన్ టెక్ కంపెనీలను ట్రంప్ సున్నితంగా హెచ్చరించారు. ‘డీప్‌సీక్’ పనితీరును ఎన్‌వీడియా సంస్థ కూడా ప్రశంసించింది.
ఇప్పటివరకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లో ఉన్న కంపెనీలన్నీ అమెరికాకు చెందినవి. ఇప్పుడిదే చైనీస్ కంపెనీ దెబ్బకి వాల్ స్ట్రీట్ అతలాకుతలం అవుతోంది. అమెరికన్ AI స్టాక్స్ బాగా నష్టపోయాయి. అడ్వాన్స్‌డ్ ఏఐకి ఖరీదైన చిప్స్, అలాగే భారీ పెట్టుబడులు అవసరం లేదని డీప్‌సీక్ యాప్ విజయమే చాటిచెబుతున్నదన్న వాదనలు పెరుగుతున్నాయి. అందుకే, ఖరీదైన చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఎన్‌వీడియా సంస్థ సోమవారం ఒక్కరోజే రూ. 51 లక్షల కోట్లను నష్టపోయింది. కాగా ‘డీప్‌సీక్ ఆర్1’ తయారీకి రూ. 51 కోట్లు ఖర్చవ్వడం గమనార్హం.
Technology Story in Telugu
మనం ఎలా బతకాలో టెక్నాలజీ, సైన్సు చెప్పదు.