Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Bitcoin అంటే ఏమిటి? – What is Bitcoin in Telugu

What is Bitcoin in Telugu – ఈ రోజు బిట్ కాయిన్ దర 32,61,859.94 INR – 22nd Mar 2022,

What is Bitcoin in Telugu

(Bitcoin) బిట్ కాయిన్: ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అత్యధిక రాబడి ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది Bitcoin. అసలు ఈ Bitcoin అంటే ఏమిటి? ఎవరు దీనిని క్రియేట్ చేసారు. అది ఎంత లాభాలను ఇచ్చింది. ఒకవేళ మనం Bitcoin కొనాలనుకుంటే ఎలా కొనాలి? దీనిలో ఉండే రిస్క్ ఏమిటి? ఇలా Bitcoin కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2010 లో ఎవరైనా 4500 రూపాయలు Bitcoin లో పెట్టుబడి పెట్టి ఉంటె 2017 లో దాని విలువ 482 కోట్లు అయ్యింది. ప్రపంచంలో ఏది కూడా ఈ స్థాయిలో రాబడిని ఇవ్వలేదు. Bitcoin అనేది ఒక క్రిప్టో కరెన్సీ (Cryptocurrency). 2009 లో Satoshi Nakamoto అనే ఒక ప్రోగ్రామర్ దీనిని క్రియేట్ చేసాడు. అయితే ఈ Satoshi Nakamoto ఎవరు అనేది ఎవరికీ తెలియదు.

ఈ Bitcoin విలువ ఇంతలా పెరగడానికి కారణం దీనిని క్రియేట్ చేసినపుడు కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్ లు మాత్రమే ఉండేలా దీనిని ప్రోగ్రాం చేసారు. కాబట్టి మరలా కొత్త Bitcoin లను క్రియేట్ చెయ్యలేరు. కానీ దీనిని కొనేవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోవడంతో డిమాండ్ బాగా పెరిగిపోయి దీని విలువ వేగంగా పెరుగుతుంది. ఇదంతా కూడా కంప్యూటర్ అల్గోరిథం మీద ఆధారపడి పని చేస్తుంది. ప్రతిదేశంలో కరెన్సీ ని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ Bitcoin ని ఏ దేశపు గవర్నమెంట్ గాని, ఏ బ్యాంకు గాని కంట్రోల్ చెయ్యదు. అలాగే ఫిసికల్ గా కాయిన్లు గాని, నోట్లు గాని ఉండవు.

ప్రస్తుతం ఇప్పుడు ఒక Bitcoin విలువ మన రూపాయల్లో 32 లక్షల 61 వేల రూపాయల పైనే. కానీ ఒకవేళ మనం Bitcoin విలువ కొనాలంటే అంత డబ్బు పెట్టవలసిన అవసరం లేదు. ఒక రూపాయకు 100 పైసలు ఎలాగో అలా ఒక Bitcoin కి 10 కోట్ల సతోషీలు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంటె దానికి సరిపడ సతోషీలు కొనుకోవచ్చు.

గత ఐదు సంవత్సరాలలో బిట్ కాయిన్ దరలో వచ్చిన మార్పులు ఇక్కడ గమనించండి

What is Bitcoin in Telugu

ఈ Bitcoin ద్వారా డబ్బులు పంపితే డబ్బులు పంపిన వ్యక్తి వివరాలు ని, రిసీవ్ చేసుకున్న వ్యక్తి వివరాలు గాని ఎవరికి తెలియదు.
అందుకే హ్యాకర్లు కూడా ఈ Bitcoin ద్వారా పేమెంట్ చెయ్యమని అడుగుతుంటారు. ఈ Bitcoin ద్వారా ఎవరైనా, ఎంత డబ్బు అయినా, ఎక్కడికైనా సులభంగా డబ్బుని పంపుకోవచ్చు. Transaction Charges కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పటికే Microsoft, Tesla, Dell, Lamborghini వంటి కంపెనీలు కూడా ఈ Bitcoin ని accept చేస్తున్నాయి.

2018 వ సంవత్సరంలో మన RBI బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ని కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా బ్యాంకు లకు నిబంధనలు విధించింది. ఈ విధంగా RBI నిషేధం విధించడంతో మనం దేశంలో చాలాకాలం పాటు క్రిప్టో కరెన్సీ చెలామణి ఆగిపోయింది. కానీ 2020 లో సుప్రీం కోర్ట్ ఈ నిషేధాన్ని ఎత్తివేసి Bitcoin వంటి క్రిప్టో కరెన్సీ ని కొని అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చింది. దానితో చాలా మంది మరలా Bitcoin కొనడానికి మొగ్గు చెపుతున్నారు.

నిరంతరం ఈ Bitcoin విలువ అమాంతంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ బిట్ కాయిన్ ని ఎవరు నడిపిస్తున్నారు? ఎక్కడి నుండి నడిపిస్తున్నారు అనేది తెలియదు కాబట్టి దీనిలో కొంచెం రిస్క్ ఉంది. కాబట్టి దీనిలో పెట్టుబడి పెట్టేముందు ఒకసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి.

ఇప్పుడే మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks