Menu Close

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

1000 + Best Telugu Samethalu - తెలుగు సామెతలు - Telugu Proverbs

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

  • ఆకలి ఆకాశమంత… గొంతు సూది బెజ్జమంత
  • ఆకారపుష్టి నైవేద్యనష్టి
  • తల లేదు కానీ చేతులున్నాయి… కాళ్లు లేవు కానీ కాయం ఉంది
  • తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
  • తా వలచినది రంభ, తా మునిగింది గంగ
  • ముందుంది ముసళ్ళ పండుగ
  • ముందొచ్చిన చెవులకంటే, వెనకొచ్చిన కొమ్ములు వాడి
  • తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
  • తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
  • ఏమండీ కరణంగారూ…? గోతిలో పడ్డారే అంటే, కాదు కసరత్తు చేస్తున్నాను అన్నాడట
  • తాదూర సందు లేదు, మెడకో డోలు
  • కణత తలగడ కాదు. కల నిజం కాదు
  • కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు|కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టుపైన నుండు జలము దాల్చి యుండు నీల మేఘుండు గాడు దీని భావమేమి తిరుమలేశ
  • అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
  • అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
  • అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • దురాశ దుఃఖానికి చేటు
  • కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు
  • ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
  • ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
  • ఆస్తి మూరెడు… ఆశ బారెడు
  • ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
  • అనువుగాని చోట అధికులమనరాదు.

  • కంచేచేను మేసినట్లు
  • కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
  • కండలేని వానికే గండం
  • కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
  • అగ్నికి వాయువు తోడైనట్లు
  • అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు
  • దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
  • ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
  • అమ్మ గృహ ప్రవేశం, అయ్య అగ్ని ప్రవేశం.
  • ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో
  • ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం
  • కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
  • డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
  • డబ్బు కోసం గడ్డి తినే రకం
  • ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకలి మింగమన్నదట
  • ఆకాశానికి నిచ్చెన వెయ్యడం
  • ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది మన ముఖం మీదె పడుతుంది
  • అంతంత కోడికి అర్థశేరు మసాలా.
  • ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు
  • ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
  • ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
  • కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
  • దున్నపోతు మీద వానకురిసినట్లు
1000 + Best Telugu Samethalu - తెలుగు సామెతలు - Telugu Proverbs
  • అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
  • ఉల్లి మల్లె కాదు కాకి కోకిల కాదన్నట్టు
  • ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
  • ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
  • ఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు
  • ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
  • కలసి ఉంటే కలదు సుఖం
  • కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
  • అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రిపూట గొడుగుపట్టమన్నాడట.
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  • కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
  • ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
  • దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
  • ఏడ్చే మగాడిని నవ్వే మహిళను నమ్మరాదు
  • చదవేస్తే ఉన్న మతి పోయిందట
  • చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ
  • అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్లు
  • దిగితేనేగాని లోతు తెలియదు
  • చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
  • చింత చచ్చినా పులుపు చావనట్టు
  • చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
  • చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
  • ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
  • ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య
  • ఒక దెబ్బకు రెండు పిట్టలు
  • ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
  • కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
  • అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మిన్న.
  • జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
  • జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
  • జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
  • జుట్టు ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
  • చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
  • చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
  • చాప క్రింది నీరులా
  • అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి.
  • అన్నం చొరవే కాని అక్షరం చొరవ లేదు
  • జగడమెట్లొస్తుందిరా జంగమయ్యా అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా అన్నాడట
  • చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
  • చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
  • చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
  • అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
  • కుక్కతోక వంకరన్నట్లు…!
  • నల్లటి కుక్కకు నాలుగు చెవులు
  • నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
  • నిండా మునిగిన వానికి చలేంటి
  • అందని ద్రాక్ష పుల్లన
  • జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
  • తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
  • తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
  • అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
  • కాలు కాలిన పిల్లిలా
  • కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
  • కుక్క కాటుకి చెప్పు దెబ్బ
  • నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
  • నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
  • పందికేం తెలుసు పన్నీరు వాసన
  • పిల్లికి బిచ్చం పెట్టనివాడు
  • పరుగెత్తి పాలు తాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
  • పిండి కొద్దీ రొట్టె
  • పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
  • అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
  • దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
  • ధర్మో రక్షతి రక్షితః
  • పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
  • పిచ్చోడి చేతిలో రాయి
  • తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
  • కాకి పిల్ల కాకికి ముద్దు
  • కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
  • నిండు కుండ తొణకదు
  • పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
  • పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
  • పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
  • నిప్పులేనిదే పొగరాదు
  • గోరంత ఆలస్యం కొండొంత నష్టం
  • ఘడియ తీరిక లేదు గవ్వ ఆమ్‌దానీ లేదు
  • నిజం నిప్పులా౦టిది
  • చంకలో బిడ్డనుంచుకుని, ఊరంతా వెతికినట్లు
  • చక్కనమ్మ చిక్కినా అందమే
  • అంతా మన మంచికే.
  • అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
  • గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

  • గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
  • నివురు గప్పిన నిప్పులా
  • నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
  • పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
  • పెరుగుట విరుగుట కొరకే
  • అనగా అనగా రాగం తినగా తినగా రోగం
  • అప్పు నిప్పులాంటిది…
  • కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
  • అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
  • తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు
  • కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
  • పైన పటారం, లోన లొటారం
  • గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
  • గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
  • గోడకేసిన సున్నం
  • అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
  • అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
  • కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
  • కోటి విద్యలు కూటి కోసమే
  • కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది
  • అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
  • అనుమానం పెనుభూతం

  • దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
  • చెప్పేవాడికి వినేవాడు లోకువ
  • చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
  • తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
  • అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
  • అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
  • నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
  • నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
  • నలుగురితో నారాయణా
  • బుగ్గ గిల్లి జోల పాడటం
  • గురివింద గింజ తన నలుపెరగదంట
  • గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
  • బెల్లం చుట్టూ ఈగల్లా
  • మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
  • మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
  • మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
  • మొగుడు కొట్టినందుకు కాదంట, తోటికోడలు నవ్వినందుకంట బాధ
  • చేతకాక మంగళవారమన్నాడంట
  • తినగ తినగ వేము తియ్యగనుండు
  • మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

  • మౌనం అర్ధాంగీకారం
  • రాజుల సొమ్ము రాళ్ళ పాలు
  • లేడికి లేచిందే పరుగు
  • అత్తచచ్చిన ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట
  • చావు కబురు చల్లగా చెప్పాడు
  • అత్త సొమ్ము అల్లుడు దానం
  • దూరపుకొ౦డలు నునుపు
  • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
  • చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
  • తేలు కుట్టిన దొంగలా
  • తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
  • దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
  • తాతకు దగ్గులు నేర్పినట్టు
  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
  • తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
  • తానా అంటే తందానా అన్నట్లు
  • తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
  • తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
  • గంతకు తగ్గ బొంత
  • దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
  • దిక్కులేనివారికి దేవుడే దిక్కు
  • అప్పుచేసి పప్పు కూడు
  • చెడపకురా చెడేవు
  • క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
  • గుండ్లు తేలి… బెండ్లు మునిగాయంటున్నాడట
  • గతి లేనమ్మకు గంజే పానకము
  • గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
  • గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
  • కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
  • గంగిగోవు పాలు గరిటడైన చాలు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
  • తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
  • తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
  • తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
  • తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
  • తల ప్రాణం తోకకి వచ్చినట్లు
  • గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
  • గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
  • గుండ్రంగా ఉంటాను భూమినికాను, నల్లగా ఉంటాను బొగ్గునుకాను, మాట్లాడతాను కాని మనిషిని కాను.
  • క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
  • చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
  • చావో రేవో తేల్చు కోవాలి
  • చదరంగం ఆట అయిపోయిన తరువాత రాజుని, బంటునీ ఒకే పెట్టెలో పడేస్తారు.
  • ఛారాన కోడికి బారాన మసాల.
  • కూటికి లేకున్నా కాటుక మాననట్లు
  • గాజుల బేరం భోజనానికి సరి
  • అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
  • జన్మకో శివరాత్రి అన్నట్లు
  • జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
  • జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
  • ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
  • ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
  • డబ్బుకు లోకం దాసోహం
  • డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
  • తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడట
  • చచ్చిన వాడి పెళ్ళికి వచ్చినంత కట్నం
  • చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్న తరువాత కీకరకాయ
  • కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
  • కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
  • కంపలో పడ్డ గొడ్డు వలె
  • కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
  • కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్ప్లి బాధ ఎరుగడు
  • కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
  • అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
  • అంగడీ అమ్మి గొంగళి కొన్నట్లు.
  • అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
  • చేసేదేమో శివ పూజలు, దూరేదేమో దొమ్మర గృహాలు
  • చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు…
  • కంటికి రెప్ప కాలికి చెప్పు
  • అంగిట బెల్లం కడుపులో విషం.
  • చెముడా అంటే మొగుడా అన్నట్టు
  • చెవిలో జోరీగ
  • కంటికి రెప్ప దూరమా
  • ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
  • అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
  • ఆవు పాతిక బందె ముప్పాతిక
  • ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
  • అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
  • చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట
  • కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
  • కట్టేవి కాషాయాలు – చేసేవి దొమ్మరి పనులు
  • కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
  • కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
  • అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు
  • అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
  • అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
  • తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
  • తనది కాకపోతే కాశీదాకా దేకచ్చు
  • ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు

  • కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు…
  • తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
  • తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
  • జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
  • జగడాల మారి
  • జగమెరిగిన సత్యం
  • మాటకు మా ఇంటికి… కూటికి మీ ఇంటికి అన్నట్లు
  • మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
  • ముంజేతి కంకణానికి అద్దమేల ?
  • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  • అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
  • కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
  • కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
  • కాసుకు గతిలేదుకానీ… నూటికి ఫరవాలేదన్నట్లు
  • గూటిలో కప్ప పీకితే రాదు
  • గోతి కాడ నక్కలా
  • గోరుచుట్టు మీద రోకటిపోటు
  • చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
  • అన్నిదానాలలోకి నిదానమే గొప్పదన్నాట్ట!!
  • అంధుడికి అద్దం చూపించినట్లు
  • ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
  • అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ.
  • కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ …చెరకు తీపి తెలుస్తుందా
  • మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
  • తామరాకు మీద నీటిబొట్టులా
  • తాను దూర సందు లేదు తలకో కిరీటమట
  • కాగల కార్యం గంధర్వులే తీర్చారు
  • కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
  • కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
  • ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
  • మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
  • మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
  • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  • కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
  • కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు…
  • కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
  • కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
  • పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
  • అర్దరాత్రి మద్దెల దరువు
  • అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  • అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందట.
  • కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
  • ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
  • ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
  • అంచు డాబే కాని, పంచె డాబు లేదు
  • అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
  • చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే, పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి
  • అధముడికి ఆలి అయ్యే దాని కంటే బలవంతుడికి బానిస కావడం మేలు.
  • జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
  • ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
  • అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
  • కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
  • కోస్తే తెగదు కొడితే పగలదు
  • గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  • గుంపులో గోవిందా
  • గుడ్డి కన్నా మెల్ల నయము కదా
  • పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
  • పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
  • అచ్చొచ్చిన భూమి అడుగే చాలు.
  • అడకత్తెరలో పోకచెక్క
  • వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
  • వాడికి సిగ్గు నరమే లేదు
  • వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
  • విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • వంకరటింకర పోతుంది పాము కాదు
  • శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
  • ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
  • ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట
  • ‘కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?’ అంటే ‘స్వరూపాలెంచటానికి పుట్టే’ అందిట.
  • సంసారం చేద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది
  • సత్రం భోజనం మఠం నిద్ర
  • ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

  • అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
  • సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
  • సన్నాయి నొక్కులే గానీ… సంగీతం లేదన్నట్లు…
  • చిలకా గోరింకల్ల వున్నారు:
  • చిలక్కి చెప్పినట్టు చెప్పాను:
  • జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
  • ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
  • ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పమౌతుంది.
  • అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
  • జలగలా పీడిస్తున్నాడు
  • ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
  • ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
  • ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
  • జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లు
  • జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా
  • అక్క మనదైతే బావ మనవాడా?
  • కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
  • అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా…
  • ఉలిపిరికట్టె కేల ఊర్లో పెత్తనం
  • కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
  • కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
  • అల్లుడికి వండిన అన్నం కొడుక్కి పెట్టిందట.
  • అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకే సరిపోలేదట.
  • గుడ్డోడికి కుంటోడి సాయం
  • ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
  • భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
  • భక్తిలేని పూజ పత్రి చేటు
  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
  • మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
  • సంతోషమే సగం బలం
  • మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
  • మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
  • దాసుని తప్పు దండంతో సరి
  • దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
  • గుడ్డెద్దు చేలో పడినట్లు
  • సంపదలో మరపులు ఆపదలో అరుపులు
  • సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
  • ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
  • ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
  • ఊర్లో పెళ్ళికి ఇంట్లో సందడి
  • మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
  • మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
  • మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
  • మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
  • మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
  • తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
  • దంపినమ్మకు బొక్కిందే కూలిట
  • అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
  • అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
  • ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
  • కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
  • నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
  • నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
  • ఊరకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
  • అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల.
  • కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
  • అతడికంటె ఘనుడు అచంట మల్లన్న
  • లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
  • కల్లు త్రాగిన కోతిలా
  • ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు
  • శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
  • సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
  • నేతిబీరలో నేతి చందంలా
  • రెక్కాడితే గానీ డొక్కాడదు
  • లేని దాత కంటే ఉన్న లోభి నయం
  • సంతులేని ఇల్లు చావడి కొట్టం
  • ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
  • దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
  • మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట
  • నవ్విన నాపచేనే పండుతుంది
  • నాగస్వరానికి లొంగని తాచు
  • నిజం నిలకడమీద తెలుస్తుంది
  • మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
  • ఉడుత ఊపులకు కాయలు రాలుతాయా
  • దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
  • రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
  • ఈనగాచి నక్కల పాలు చేసినట్లు
  • ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు
  • మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
  • మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  • రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
  • రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
  • రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
  • ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
  • అతి వినయం ధూర్త లక్షణం
  • ఉట్ట గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
  • నిప్పు ముట్టనిదే చేయి కాలదు
  • అత్త చేసే పనులకు ఆరళ్ళే లేవట.
  • వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
  • వస్తే కొండ పోతే వెంట్రుక
  • విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
  • ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
  • ఆశ సిగ్గెరుగదు…. ఆకలి రుచి ఎరుగదు
  • నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
  • నీటిలో రాతలు రాసినట్లు
  • రెడ్డొచ్చె మొదలాడు
  • నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
  • ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
  • అందరు అందలం ఎక్కితే …. మోసేవాడెవరు?
  • నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
  • చిత్తశుద్ది లేని శివపూజలేల
  • అన్నీ ఒక్కటే అని అర్థం.
  • ఆ మొద్దు లోదే ఈ పేడు
  • నూరు చిలుకల ఒకటే ముక్కు
  • నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
  • రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
  • దానం చేయని చెయ్యి… కాయలు కాయని చెట్టు…
  • ధైర్యే సాహసే లక్ష్మి
  • వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
  • వీపు విమానం మోత మోగుతుంది
  • వేపకాయంత వెర్రి
  • చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
  • చల్లకొచ్చి ముంత దాచినట్లు
  • తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  • కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు?
  • చారలపాపడికి దూదంటి కుచ్చు
  • ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట
  • అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
  • ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు
  • ఈనగాచి నక్కల పాలు చేసినట్లు
  • ఒంటి చేత్తో సిగముడవటం
  • ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
  • అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
  • అందని మామిడిపండ్లకు అర్రులు చాచినట్లు
  • తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
  • ఓర్చినమ్మకు తేట నీరు
  • ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య
  • కంగారులో హడావుడి అన్నట్లు
  • తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
  • తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
  • అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
  • అందరూ అందలం ఎక్కితే మోసేవాళ్ళెవరు?
  • ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
  • మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
  • ఉడుత కేల ఊర్లో పెత్తనం
  • నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
  • సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
  • మొండివాడు రాజు కన్నా బలవంతుడు
  • కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
  • కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
  • కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు
  • అందరికీ నేను లోకువ, నాకు నంబిసింగరాయ లోకువ.
  • ఈవూరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం
  • అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
  • నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
  • ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
  • శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
  • శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
  • రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
  • తినబోతూ రుచులు అడిగినట్లు
  • ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
  • శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
  • శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
  • తిన్నింటి వాసాలు లెక్కేయటం
  • రాత రాళ్ళేలమని ఉంటే… రాజ్యాలెలా ఏలుతారు…?
  • సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
  • అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
  • ఉన్న మాటంటే ఉలుకెక్కువ
  • ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు
  • ఉపకారం చేయబోతె అపకారాం ఎదురైనట్లు
  • చచ్చి సున్నం అయ్యాడు
  • చాప కింద నీరు లాగ
  • మా తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకమన్నాడంట
  • మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
  • చిదంబర రహస్యం:
  • పక్కలో బల్లెం
  • పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
  • పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
  • పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
  • పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
  • సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
  • సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
  • అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టినట్లు
  • మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
  • పండగ నాడు కూడా పాత మొగుడేనా?
  • పండిత పుత్ర పరమ శుంఠ
  • ఉన్నది పోయె ఉంచుకున్నది పోయె అన్నట్టుంది/*ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
  • పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
  • పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనపెట్టుకున్నట్లు
  • బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
  • బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
  • పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
  • పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
  • అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు
  • సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
  • అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
  • ఉన్న వూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారము వృధా
  • పండితపుత్రుడు… కానీ పండితుడే…
  • సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
  • సిగ్గులేని వాడికి నవ్వే సింగారం
  • సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
  • బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
  • బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
  • పొయ్యి దగ్గర పోలీసు
  • అప్పిచ్చువాడు బాగు కోరతాడు, తీసుకున్నవాడు చెడు కోరతాడు.
  • సొమ్మొకడిది సోకొకడిది
  • హనుమంతుడి ముందా కుప్పిగంతులు
  • తూట్లు పూడ్చి… తూములు తెరిచినట్లు…
  • అప్పిచ్చువాడు వైద్యుడు
  • తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
  • చిక్కు ముళ్లు వేశాడు
  • చిలక పలుకులు చిటికెలో వస్తా
  • అభ్యాసము కూసు విద్య
  • తోక తెగిన కోతిలా
  • సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
  • పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
  • పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
  • పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
  • పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
  • అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
  • అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
  • ఉపాయం లేని వాణ్ని ఊర్లో నుండి వెళ్ల గొట్టమన్నారు.
  • ఉప్పు రుచులకు రాజు….. రోగాలకు రా రాజు
  • బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
  • బతికి పట్నం చూడాలి…చచ్చి స్వర్గం చూడాలి
  • ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
  • అందితే తల, అందకపోతే కాళ్లు
  • బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట

  • రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
  • రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
  • రెంటికీ చెడిన రేవడి చందాన
  • నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
  • రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
  • రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
  • రౌతు కొద్ది గుర్రం
  • రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
  • లంఖణం పరమౌషధం
  • నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
  • నేల విడిచి సాము చేసినట్లు
  • నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
  • పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
  • పొట్టోడికి పుట్టెడు బుద్దులు
  • పొమ్మనలేక పొగపెట్టినట్లు
  • పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
  • అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు…
  • అరటిపండు ఒలిచి చేతిలోపెట్టినట్లు.
  • అరిచే కుక్క కరవదు
  • బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
  • పొరుగింటి పుల్లకూర రుచి
  • పోనీలే అని పాతచీర ఇస్తే మూల కెళ్ళి మూరలేసుకుందట
  • బతకలేక బడి పంతులని
  • సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
  • పావలా కోడికి ముప్పావలా దిష్టి
  • పాడిందేపాడరా, పాచిపళ్ళదాసుడా
  • పాలు, నీళ్ళలా కలిసిపోయారు
  • పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
  • చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
  • చచ్చి చెడి వచ్చాడు
  • సింగడు అద్దంకి వెళ్లినట్టు
  • సింగినాదం జీలకర్ర
  • చెరువు మీద అలిగి….స్నానం చేయనట్లు

1000 + Best Telugu Samethalu – తెలుగు సామెతలు – Telugu Proverbs

Like and Share
+1
4
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading