ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? What is Cloud Burst in Telugu?
సింపుల్ గా చెప్పాలంటే దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇలా ఒకేసారి కుండకు చిల్లుపడినట్లు వర్షం పడుతుంది. ఒకే చోట భారీ స్థాయిలో పడే వర్షాలు మన దేశంలో ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటాయి.
ఇటీవల జూలై 8న జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో.. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో 16 మంది చనిపోగా 20 మందికిపైగా గాయపడ్డారు. కానీ వాస్తవానికి అది క్లౌడ్ బరస్ట్ కాదు. క్లౌడ్ బరస్ట్ వల్ల తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. కొద్దిసేపట్లోనే ఎక్కువ వర్షం పడిన ప్రతి సందర్భాన్ని క్లౌడ్ బరస్ట్ అని అనలేం.
అసలు ఈ క్లౌడ్ బరస్ట్ ఎలా సంభవిస్తుంది?
పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు.. సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు.. వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతోపాటు.. అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి.
2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఆ సమయంలో అక్కడ భారీ స్థాయిలో మేఘాలు ఏర్పడగా.. వాటి సాంద్రత కూడా అంతే వేగంగా పెరిగిపోయింది. దీని వల్లే క్లౌడ్ బరస్ట్ సంభవించి ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాపేక్ష ఆర్ధ్రత, మేఘాలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరడం, అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలులు మెల్లగా వీయడం లాంటి పరిస్థితులు క్లౌడ్ బరస్ట్‌కు దారి తీశాయి. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో అమర్‌నాథ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. లక్కీగా కరోనా కారణంగా అప్పుడు అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.
ఈ మద్య క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర ఉండొచ్చన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను జాతీయ మీడియా సైతం హైలెట్ చేసింది. మరో పక్క సోషల్ మీడియాలో కూడా చర్చకు దారి తీసాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో రోజు మొత్తం మీద దాదాపుగా100 మిల్లీమీటర్లు వర్షం కురుస్తుంది. దీనిని మనం క్లౌడ్ బరస్ట్ అనలేము.
ఈ సమాచారం మీకు నచ్చినట్లైతే తప్పకుండా ఈ పోస్ట్ ని మీ సోషల్ మెడియాలో షేర్ చెయ్యండి.
What is Cloud Burst in Telugu?