ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Veyi Naamaala Vaada Song Lyrics in Telugu – Om Namo Venkatesaya – వేయి నామాలవాడ వేంకటేశుడా లిరిక్స్
వేంకటేశా, శ్రీనివాసా, శేశషైలవాసా…
మాధవా, కేశవా, మధుసూధనా… మాధవా, కేశవా, మధుసూధనా
నంద నందనా… నరహరి నారాయణా…
పరమాత్మా, పరంధామ పరమానందా…
అచ్యుతా అనంతా గోవిందా… అచ్యుతా అనంతా గోవిందా…
వేయి నామాలవాడ వేంకటేశుడా…
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా…
వేయి నామాలవాడ వేంకటేశుడా…
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా…
కోటి కోటి దండాలయ్య కోనేటిరాయడా…
కోటి కోటి దండాలయ్య కోనేటిరాయడా…
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
మురహరా, నగధరా, మురలీధరా… శ్రీకరా, శ్రీధరా, శ్రిత మందార…
సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా… శంక చక్రధరా సప్త శైలేశ్వరా…
సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా… సూర్యుడవయ్యా…
అజ్ఞానపు చీకటులను అనచెదవయ్యా… మాధవా కేశవా
అభిశేక సేవలో మురిసేవయ్యా… మురిసేవయ్యా…
ఆత్మ కల్మశముల కడిగి కాచేవయ్యా… శ్రీకరా శ్రీధరా…
కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా…
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా…
వేయి నామాల వాడ వేంకటేశుడా
మూడు నామాల… ముద్దు శ్రీనివాసుడా…
నిజ పాద దర్శనమున… నిలిచేవయ్యా… నిలిచేవయ్యా…
నీ పాదాలె దిక్కు అని చాటెదవయ్యా… అచ్యుతా అవ్యయా…
నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా… ఇచ్చేవయ్యా…
మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా…
మురహర, నగధరా…
కోటి కోటి దండాలయ్యా… ఆ ఆ ఆ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడా…
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా…
వేయి నామాల వాడ వేంకటేశుడా
మూడు నామాల… ముద్దు శ్రీనివాసుడా…
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడా…
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా.. ..
Veyi Naamaala Vaada Song Lyrics in Telugu – Om Namo Venkatesaya – వేయి నామాలవాడ వేంకటేశుడా లిరిక్స్