Veyi Kannulatho Lyrics In Telugu – Nee Sneham – వేయి కన్నులతో వేచి చూస్తున్నా లిరిక్స్
వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా…
వేయి కన్నులతో వేచి చూస్తున్నా…
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం…
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్నూ…
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను…
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా…
ఎంత గాధ పెంచినా అందనన్న పంతమా..
ఎంత ఆశ ఉన్న… నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా…
వేయి కన్నులతో వేచి చూస్తున్నా…
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం
వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా…
వేయి కన్నులతో వేచి చూస్తున్నా…
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం…
వేయి కన్నులతో వేచి చూస్తున్నా…
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం…
ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా… చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని… ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి… ఒక్కసారి… ల ల ల…
ఒక్కసారి అయినా…. చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా….
వేయి కన్నులతో వేచి చూస్తున్నా…
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం…
ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా… నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా.. వెంట ఉంది నేననీ… చూడలేని నిన్నెలా.. కలుసుకోను చెప్పుమా..!
ఎన్ని జన్మలైనా…. పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని…
వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా.. ..
Veyi Kannulatho Lyrics In Telugu – Nee Sneham – వేయి కన్నులతో వేచి చూస్తున్నా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.