Ammo Ammayena Lyrics In Telugu – Vasantham – అమ్మో అమ్మాయేనా లిరిక్స్
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా… ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే… తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే… సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి… ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో… నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా… ఇంతందం సాధ్యమా
అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా… ఇంతందం సాధ్యమా
ప్రియా నిన్ను చూసి… మదే మారిపోయే
అదేమ్మాయో గానీ వాన వెల్లువ
చెలీ నిన్ను చేరి… ఎడారైన గాని
వసంతాలు జల్లె పూల వెల్లువా
నువే నిద్దరోతే నేను జోలపాటనౌతా
నువే దగ్గరైతే హాయిలోన తేలిపోతా
చెలీ నువ్వు ఔనంటే… సరాగాల సంబరమౌతా
నువ్వు నేను ఏకమై… ఇపుడే మనమౌదాం
నింగినేల సాక్షిగా… ఎపుడు ఒకటౌదాం
అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వశికైనా… ఇంతందం సాధ్యమా
కలలోన నిన్ను చూసి… మనసారా కోరుకున్నా
ఇలలోన ఇంతలోన… ఎదురైతే చేరుకున్నా
నాలో ఏదో సవ్వడి… ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో… నన్నే మార్చినది.. ..
Ammo Ammayena Lyrics In Telugu – Vasantham – అమ్మో అమ్మాయేనా లిరిక్స్