అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
వేయి జన్మాల చెలిమి నీవే… తెలుసు నా గుండెకీ…
కోటి దీపాల వెలుగు నీవే… తెలుసు నా కంటికీ…
నినుదాచే ఈ నిశి… నిలిచేనా ప్రేయసీ
నలువైపుల నల్లని చీకట్లే… ఎదురొస్తూ ఉన్నా…
పరుగాపని పాదం దూరంతో… పోరాడుతు ఉన్నా…
కనుపాపకి ఉప్పని కన్నీరే… తెరవేస్తూ ఉన్నా…
ప్రతి నిమిషం నీవైపే… పయనిస్తూ ఉన్నా…
వేయి జన్మాల చెలిమి నీవే… తెలుసు నా గుండెకీ..!
గాలితో నువ్వు పంపిన… వలపు ఊసేమిటో…
పూలలో నువ్వు నింపిన… తీపి తలపేమిటో…
నిన్న దాక నను చేరలేదని… నమ్మదా చెలి నీ మౌనం…
నా శ్వాసతో రగిలే గాలులతో… నిను వెతికిస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో… నీ కందిస్తున్నా
ఎద సవ్వడులే… ఆ గువ్వలుగా ఎగరేస్తూ ఉన్నా
అవి నిన్నే చూడాలి… నువ్వెక్కడ ఉన్నా…
వేయి జన్మాల చెలిమి నీవే… తెలుసు నా గుండెకీ…
ఆశగా ఉంది నెచ్చెలీ… కలుసుకోవాలనీ…
కోవేలై ఉంది కౌగిలి… దేవి రావాలనీ…
నీవు కలవనీ కలవు కాదనీ… రుజువు చేయనీ అనురాగం
నను నేనే శిలగా మోస్తున్నా… ఎద బరువైపోగా
చిరునవ్వుల్నే వెలి వేస్తున్నా… నిను చూసేదాకా
ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా… పెను జ్వాలైపోగా…
ఎడబాటు పొరబాటు కరిగించే దాకా…
వేయి జన్మాల చెలిమి నీవే… తెలుసు నా గుండెకీ…
కోటి దీపాల వెలుగు నీవే… తెలుసు నా కంటికీ…
నినుదాచే ఈ నిశి… నిలిచేనా ప్రేయసీ
నలువైపుల నల్లని చీకట్లే… ఎదురొస్తూ ఉన్నా…
పరుగాపని పాదం దూరంతో… పోరాడుతు ఉన్నా…
కనుపాపకి ఉప్పని కన్నీరే… తెరవేస్తూ ఉన్నా…
ప్రతి నిమిషం నీవైపే… పయనిస్తూ ఉన్నా…
వేయి జన్మాల చెలిమి నీవే… తెలుసు నా గుండెకీ