Vallanki Pitta Lyrics in Telugu – Gangotri
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటు
చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంట
తను నవ్విందంటే ఇంకేం కావాలి
నిదరోతూ ఉంటే..తను పక్క నుండాలి…
ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి ||వల్లంకి||
గరిసని సమ గరిసా ||2||
సగమ నినిప మగమా ||2||
పాప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిసా ||2||
చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగేవేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవునిదిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి ||వల్లంకి||
ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మ నవుతా…
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వ నవుతా…
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా…
ఎక్కెక్కి ఏడ్చేవేళ కన్నీళ్ళవుతా….
నేస్తాన్నవుతా…గురువు అవుతా…
పనిమనిషి తనమనిషవుతా…
నే చెప్పే ప్రతిమాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి …
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంట…
మా మంచి పాట సిమ్మాద్రి పాట మనసారా వినమంట
తన తియ్యని పాటే అమ్మ పాడేలాలీ…
తనతోడే ఉంటే అది దీపావళీ…
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి ||వల్లంకి పిట్ట||
Vallanki Pitta Lyrics in Telugu – Gangotri
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.