అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Uses and Side Effects of Eating Paan
తమలపాకులు, వక్కలు, సున్నం కలిపిన తీసుకోవడాన్ని తాంబూలం అంటారు. భారత సాంప్రదాయ పద్ధతులలో ఒకటైన తాంబూల సేవన అజీర్ణానికి బాగా ఉపకరిస్తుంది. తమలపాకుల్లో కొంచెం తీపి, కొంచెం వగరు కలిగి ఉంటుంది. ఇది కఫాన్ని హరిస్తుంది. అయితే పిత్తాన్ని మాత్రం ఎక్కువ చేస్తుంది.
తాంబూలంలో వక్కలతో పాటు ఏలకలు, లవంగ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. అవి నోటి దుర్వాసనను పారద్రోలడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాంబూలంలో ఉదయాన వక్క ఎక్కువగానూ, రాత్రి సున్నము ఎక్కువగా ఉండేలా తయారు చేసుకోవాలి. తాంబూలము నమిలేటప్పుడు మొట్టమొదట వచ్చే రసం విషపూరితంగా ఉంటుందని చెపుతారు.

రెండవసారి నమిలినపుడు వచ్చే రసము – అజీర్ణమునకు కారణమవుతుందని అంటారు. మూడవసారి జనించే రసము అమృతంతో సమానం అంటారు. కాబట్టి తాంబూలం వేసుకొన్న తర్వాత మొదట నోట్లో ఊరిన లాలాజలాన్ని ఉమ్మివేస్తూ చివరి లాలాజలాన్ని మాత్రమే మింగుట ఆరోగ్యకరమని చెపుతారు.
ఆకు, వక్క సున్నం తరచుగా అందరూ తినేది. తమలపాకు లో ఉన్న ఆరోగ్య రహస్యాలు మనకు తెలిసినవే, అయితే నిజమైన తాంబూలం అంటే ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేదపరంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి.
తాంబూలం వల్ల ఎముకలను దృడంగా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలిక్ యాసిన్ వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. తాంబూలం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. తాంబూలం తీసుకోవడం వెనుక ముఖ్యకారణం ఇదే. అయితే కాలం గడిచేకొద్దీ తాంబూలం అనేది కూడా వెనకబడిపోతోంది. కారణం ఏదైనా కావచ్చు. అయితే దీనిని కొత్తగా తీసుకువచ్చారు పాన్ లేదా కిళ్ళీ అనే రూపంలో.
పాన్ లేదా కిల్లి లను తాంబూలమనే చాలామంది అనుకుంటారు అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం పాన్ తయారీలో ఆకు వక్క సున్నం కాకుండా వాడే ఇతర పదార్థాలు కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసి చూడటానికి కళాత్మకంగా చేసినా ఆరోగ్యానికి అంత మంచిది కాదనే చెప్పవచ్చు.

స్వీట్ పాన్, డ్రై ఫ్రూట్ పాన్, చాక్లెట్ పాన్ అంటూ రకాలు తీసుకువచ్చిన మన సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన పలితాలను మాత్రం ఇవ్వలేవు. అయితే చాలా మంది తాంబూలం వేసుకోవడం చిన్న తనంగా అదేదో తప్పు చర్యగా చూస్తారు. ముఖ్యంగా పాశ్చాత్యులు తాంబూల సేవనాన్ని డర్టీ హాబిట్ గా ముద్ర వేశారు. అందులో గల ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వధులుకోరు మరి.
Side Effects of Paan
రోజుకు 5 నుంచి 10 తమలపాకులను తినే అలవాటు రెండేళ్ల కంటే ఎక్కువ ఉంటే .. డ్రగ్స్ మాదిరిగా వాటికి బానిసలవుతారట. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండాలి. తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్ సంబంధిత సంకేతం. కాబట్టి .. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషధం, అతిగా తీసుకుంటే విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ కిళ్లీ తింటే ‘పట్టే మంచాలు’ పదైనా విరగాల్సిందే..!
బెడ్ రూమ్ లో భాగస్వామిని సుఖ పెట్టి మగ మహరాజు అనిపించు కోవాలని ఏ మగాడికి ఉండదు చెప్పండి. అందరికీ అక్కడ కింగ్ అనిపించు కోవాలనే ఉంటుంది. కానీ పట్టే మంచం విరిచేంత దూకుడు ప్రతీ సారి ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ఎలాగైనా పార్ట్నర్ ని సంతోష పెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఒంట్లో కాస్త శక్తి తక్కువ ఉన్నవారు వయాగ్రా వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. కాగా మహారాష్ట్ర ప్రజలకు ఈ బాధ లేదట. సింపుల్ గా ఓ కిళ్లీ వేసుకుంటే చాలు రెండ్రోజులు పడక గదిలో పండగ చేసుకోవచ్చట. రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు ఇక ఆ కిళ్లీకి ఫుల్ గిరాకీ ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో తారా పాన్ సెంటర్లో మాత్రమే ఈ కోహినూర్ అనే కిళ్లీ దొరుకుతుంది. ఇక్కడ పడక గదిలో రెచ్చిపోయే కిళ్లీ మాత్రమే స్పెషల్ గా తయారు చేస్తారు. అది తింటే 48 గంటలు ఏకధాటిగా భాగస్వామిని సుఖ పెట్టవచ్చంట. ఈ కోహినూర్ కిళ్లీ కోసం వచ్చేవారితో ఆ పాన్ సెంటర్ కిట కిట లాడుతూ ఉంటుంది.

ఇంతకీ ఆ కిళ్లీ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాని ధర అక్షరాలా రూ. 5000 రూపాయలు. దానికి ఎందుకు అంత ధర అంటే ఆ కిళ్లీలో వాడే మూలికలే కారణమని చెబుతున్నారు. ఈ కిళ్లీలో వేసే ‘కస్తూరీ’ కిలో రూ.70 లక్షలు విలువ ఉంటుంది. దీనితోపాటు కుంకుమ పువ్వు కూడా వాడతారు. ఇది కిలో రూ.70 వేలు. కిలో రూ.80 వేలు విలువ చేసే గులాబ్ రూ.7 లక్షల విలువ చేసే అగర్ ఈ కిళ్లీలో కలుపుతారు. ఇవి కాకుండా కొన్ని రహస్య పదార్థాలను పాన్ షాప్ యజమాని కిళ్లీలో యాడ్ చేస్తారు. స్త్రీలకు మూడ్ తెప్పించే కిళ్లీలు కూడా ఇక్కడ వెరీ స్పెషల్. గులాబ్ తెల్ల ముస్లీలను కిళ్లీలో చేర్చి ఇస్తారు. ఈ కిళ్లీ తింటే లేడీస్ కూడా రెచ్చిపోయి పురుషులకి సహకరిస్తారంటా. అందుకే మహారాష్ట్రలో పెళ్లిళ్ల సీజన్లో తారా పాన్ సెంటర్ వద్ద జనాలు క్యూ కట్టి ఉంటారట. ఇంకో ట్విస్ట్ ఏమీటంటే ఈ కిళ్లీలలో కలిపే రహస్య పదార్థాలు షాప్ యజమాని మహ్మద్ సిద్ధికీ అతడి అమ్మకు మాత్రమే తెలుసట. అంత లాభం తెచ్చే కిళ్లీ తయారీ వివరాలు బయట పడకుండా వారి కుటుంబం దశాబ్దాలుగా ఆ బిజినెస్ చేస్తోంది. 48 గంటల పాటు మగ మహారాజులా నిలవాలనుకుంటున్న వారు ఓసారి కిళ్లీ వైపు లుక్కేయవచ్చు.
తాంబూలం, కిళ్ళీ, పాన్ – విశిష్టత, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – Uses and Side Effects of Eating Paan
Telugu Poetry – https://kavithalu.in