ట్రంప్ టారిఫ్‌లు – వరమా లేక శాపమా – Trump Tariffs Effect on USA
Trump Tariffs Effect on USA: మార్చి 4న అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు భూమ్మీద ఉన్న ప్రతి దేశం మనల్ని దోచుకుంది. కానీ, ఇకపై మేము దీనిని ఒప్పుకోం” అని వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆర్థిక విధానాలలో మార్పులు టారిఫ్‌లతోనే మొదలు పెట్టారు. వాణిజ్య సమతుల్యతను తీసుకురావడం, దిగుమతులు-ఎగుమతుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 2024 నాటికి అమెరికా వాణిజ్య లోటు 900 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం.
ఆర్థికవేత్తలు చెబుతున్నట్లు, ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు (టారిఫ్‌లు) అమెరికాలో ధరల పెరుగుదలకు దారితీయవచ్చని, దీనివల్ల వినియోగదారులకు అదనపు భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధించడం వల్ల, అమెరికా కంపెనీలు అధిక ఉత్పత్తి వ్యయాన్ని ఎదుర్కొంటాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇతర దేశాలు కూడా ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశముంది. దీని ప్రభావంగా, అమెరికా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని కోల్పోయే ప్రమాదం ఉంది. మూడీస్ అనలిటిక్స్ అంచనా ప్రకారం, సుంకాల ప్రభావం వల్ల వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6 శాతం క్షీణించవచ్చని, దీని ఫలితంగా 2.5 లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించింది.
కానీ, ట్రంప్ అభిప్రాయం ప్రకారం, సుంకాలు దీర్ఘకాలంలో అమెరికా ఉత్పాదకతను పెంచుతాయని, ఉద్యోగాలను కాపాడతాయని, ఈ విధానం ద్వారా పన్ను ఆదాయం మరియు ఆర్థిక వృద్ధి పెరుగుతాయని తెలిపారు.
హ్యుందాయ్ 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి:
టారిఫ్‌ల ప్రభావంగా, దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమెరికాలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మార్చి 24న ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, “సుంకాల వల్ల విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేస్తాయి” అని అన్నారు.
అమెరికా ప్రభుత్వం పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించినప్పటికీ, కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చింది. ఉత్తర కొరియా, రష్యా, బెలారస్, క్యూబా వంటి దేశాలు ఇప్పటికే అమెరికా ఆంక్షల ప్రభావంలో ఉన్నందున, ఈ సుంకాలు వారిపై ప్రభావితం కావని వైట్ హౌస్ ప్రకటించింది.
కెనడా మరియు మెక్సికో దేశాలు తమ దిగుమతుల కోసం ఎక్కువగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడతాయి. తాజా సుంకాల కారణంగా, ఈ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, దీని వల్ల ఆర్థిక మాంద్యం ముప్పు పెరుగుతుందని మూడీస్ నివేదిక హెచ్చరించింది.
భారత్‌పై 26% టారిఫ్ విధించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారత దిగుమతిదారులకు ఇది అదనపు భారంగా మారవచ్చు, కానీ దీని వల్ల అమెరికా పరిశ్రమలు లాభపడతాయనే అభిప్రాయం కూడా ఉంది.
ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా ఉత్పత్తిని పెంచుతాయా? లేక వ్యాపార సంబంధాలను దెబ్బతీస్తాయా? అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో ఇది నిజంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందా? లేక వినియోగదారులకు భారమవుతుందా? అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation