Top 10 Telugu Quotes | Life Quotes | Reality Quotes | తెలుగు కోట్స్
కొన్ని బంధాలు ఎలాంటివైనా
తెగతెంపులు చేసుకోలేక
జీవితాంతం భరిస్తూ ఉండేవాళ్ళు
చాలామంది ఉన్నారు మన చుట్టూ..

చాలామంది అహంకారం, అజ్ఞానం వల్ల
వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు.
అవసరానికి, కోరికకి మధ్య
తేడా తెలిసినవారు
జీవితంలో ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందిపడరు.
బాధ్యత గురించి తెలియనివాడు
పెత్తనమే బాధ్యతగా భావిస్తాడు.
చేసే పనికి బాధ్యత వహించిన వారికి
ఏ పని అప్ప చెప్పకూడదు.
జలగల్లాంటి మనుషులకి
ఎంత దూరంగా కుదిరితే
అంత దూరంగా ఉండు.
నీ కష్టాన్ని నీకే తెలియకుండా పీల్చేస్తారు.
రేపు రాజులా బ్రతకాలంటే,
ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే.
ఎందుకు పుట్టావురా “వంకరా” అంటే
“సక్కగా” ఉన్న వాళ్ళని ఎక్కిరించేందుకు అన్నాడంట.
ఈ సమాజంలో ప్రతి నోరూ మోగుతుంది
అందులో నిజం ఉంటే సరిచేసుకో లేకుంటే విని ఊరుకో..
డబ్బు ప్రతి సమస్యను పరిష్కరించకపోవచ్చు
కానీ డబ్బు లేకపోవడం చాలా సమస్యలు పుడతాయి.
ఈరోజు అవసరం లేనివి కొంటే
రేపు అవసరం ఉన్నవి అమ్మ కావాల్సి వస్తుంది.
ప్రతి మనిషికి విలువ కట్టు
వారికున్న సంపదను బట్టి కాదు.
వారి ప్రవర్తనను బట్టి..
ఎవరి విలువను బట్టి వారిని
ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు.
దొంగ మనసు మార్చడం కన్నా
ఇంటికి తాళం వేసుకోవడం మంచిది.
కొంతమంది మృగాలను ఆపలేనప్పుడు
ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఆలోచించండి…
Top 10 Telugu Quotes | Life Quotes | Reality Quotes | తెలుగు కోట్స్