Life Changing Telugu Quotes – తెలుగు కోట్స్ – సూక్తులు
అందరి గురించి నీ దగ్గర మాట్లాడేవారు,
నీ గురించి కూడా అందరి దగ్గర మాట్లాడతారు.
డబ్బుకంటే విలువైనది
“మనశ్శాంతి”
అది నిజాయితీ పరులకు మాత్రమే దొరుకుతుంది.
సమయానికి ఉపయోగపడనిది ఏదైనా
అది విలువ లేనిది.

భయం, బాధ్యత లేని వారు
జీవితంలో ఏదీ నిలబెట్టుకోలేరు.
మనల్ని మనం ఎప్పుడూ
ఉన్నతమైన వారితో పోల్చుకోవాలి
వారితో పోటీపడాలి,
అంతేకానీ సన్నాసులతో పోల్చుకుని
వారి కన్నా మనం బెటర్ అని అనుకోకూడదు.
నువ్వు ఎంత పేద వాడివైనా
ఉన్నదాంట్లో సంతోషంగా బ్రతికి చూడు.
నిన్ను చూసి అన్నీ ఉన్నోడు కూడా..
కుళ్లుకుంటాడు, అలాంటి జీవితం నాకెందుకు లేదని.
మీ అమ్మానాన్న నిన్ను కష్టపడి చదివించింది
జాబ్ చేసి డబ్బు సంపాదిస్తావని. అంతేకానీ,
జ్ఞానం, తెలివితేటలు పెంచుకొని వచ్చి
వాళ్లకే నీతులు చెప్తావని కాదు.
Like and Share
+1
+1
+1