Menu Close

Top 10 Good Friday Telugu Quotes | Good Friday Telugu Wishes | గుడ్ ఫ్రైడే కోట్స్

Top 10 Good Friday Telugu Quotes | Good Friday Telugu Wishes

Top 10 Good Friday Telugu Quotes Good Friday Telugu Wishes 3

మన కోసం ప్రభువు శిలువనెక్కాడు,
మన తప్పులను ఏసు ప్రభువు స్వీకరించారు.
ఆ ప్రభువు రుణం ఎప్పటికీ తీర్చలేనిది.
మిత్రులందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఏసుప్రభువు త్యాగాలను స్మరించుకుంటూ,
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఏసుప్రభువు మార్గం శాంతియుతం,
ఆయన జీవితం మార్గదర్శనం,
ఆ ప్రభువు చల్లగా దీవించాలని కోరుకుందాం.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

గుడ్ ఫ్రైడే రోజున ఆ ఏసుప్రభువు కృప
మీకు, మీ ప్రియమైన వారికి తోడుగా ఉండాలి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

Top 10 Good Friday Telugu Quotes Good Friday Telugu Wishes 3

Good Friday Telugu Quotes

గుడ్ ఫ్రైడే నాడు మాత్రమే కాదు
ఎప్పుడూ మనమందరం
ప్రేమ, దయ, మంచితనంతో ఉండేలా
ఆ ప్రభువు ఆశీర్వదించాలి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ప్రియమైన ప్రభువా ఈ ప్రపంచమంతా
శాంతి, సౌభ్రాత్వుత్వాలతో మెలగాలని కోరుకుంటున్నాను.
అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

Top 10 Good Friday Telugu Quotes Good Friday Telugu Wishes 3

ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ
మనల్ని మరింత ఉన్నతంగా మార్చుతాయి.
ఆ ప్రభువు ప్రేమ ఎప్పుడూ మనపై ఉండాలి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ప్రభువుపై మనకున్న విశ్వాసం,
మనకు శాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఆ ఏసుప్రభువు దయతో
మన జీవితాలు మరింత మెరుగవ్వాలి.
భవిష్యతుకు బంగారు బాటలు పడాలి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

Top 10 Good Friday Telugu Quotes Good Friday Telugu Wishes 3

గుడ్ ఫ్రైడే రోజున ఆ ప్రభువు మనల్ని
ఎప్పుడూ ఆశీర్వదించి,
సరైన మార్గాన్ని చూపుతూ ఉండాలని
నేను ప్రార్థిస్తున్నాను.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

ఆ దేవుడి కృప కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలి.
గుడ్ ఫ్రైడే మీకు శుభాలు కలిగించాలి
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

దేవుడిపై నమ్మకం,
నీకు మనస్శాంతి కలిగిస్తుంది.
నీ జీవితంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది.
దేవుడు నిన్ను ఎప్పుడూ దీవించాలి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Why we Celebrate Good Friday in Telugu – గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటాము..

ఇది పండగ కాదు, ఈ రోజు మనం సంబరాలు జరుపుకునే రోజు కాదు, ప్రభువు మన తప్పులను తనపై ఏసుకుని, మనకోసం శిక్షను అనుబవించడానికి సిద్ధమై సిలువనెక్కిన రోజు.. మనం అనుభవించాల్సిన శిక్షను ఆయను మోసిన రోజు.. మనం ఈ రోజు ఆయన పాదాల మీద పడి ఏడుద్దాం అయ్యా ప్రభువా మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని..? మాకోసం నువ్వు చేసిన త్యాగానికి ఏమివ్వగలం అని..? నిత్యం నీ సన్నిదిలో నిన్ను తలుచుకుంటూ కాలం గడపడం తప్ప ఇంకేం చేయగలం తండ్రి, లోకాన్ని ఏలేవాడివి.. మీకు వేలవేల కృతజ్ఞతలు తండ్రి.

ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ను ఈస్టర్ కి రెండు రోజులు ముందు జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2న వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు భక్తుల పాపాల నుంచి విముక్తిని కలిగించడం కోసం సిలువ ఎక్కిన రోజుగా భావిస్తారు.

ఈరోజు యేసుక్రీస్తును సిలువ వేసిన రోజను స్మరించుకుంటూ శోకతప్త హృదయంతో క్రైస్తవులందరూ తపస్సు, ఉపవాసం ఉన్న రోజు.ఈ విధంగా యేసుక్రీస్తు సిలువ ఎక్కిన రోజు కావడంతో గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇవి క్రైస్తవులకు 40 రోజుల ఉపవాస కాలం అని చెప్పవచ్చు.

గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు లోక రక్షణ కోసం సిలువ ఎక్కడంతో అందుకు గుర్తుగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తూ కొయ్యతో తయారు చేసినటువంటి సిలువను చర్చిలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలతో పూజిస్తారు.

అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులందరూ యధావిధిగా చర్చికి వెళ్లి మూడు గంటల వరకు సేవలలో పాల్గొంటారు. ఇందులో భాగంగా లోక రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన సిద్ధాంతాలను భక్తులకు వినిపించి వారి చేత కూడా చదివిస్తారు. ఈ క్రమంలోనే మత పెద్దలు క్రీస్తును ఎలా శిలువ చేశారనే విషయంపై ఉపన్యాసాలు చేస్తారు.

ఈ విధంగా క్రీస్తు ఉపన్యాసాల అనంతరం అర్ధరాత్రి వరకు చర్చిలో క్రైస్తవులందరూ సామూహిక ప్రార్థనలతో క్రీస్తు తమ కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ప్రార్థిస్తారు. మరికొన్ని చోట్ల క్రైస్తవులందరూ నల్లటి వస్త్రాలు ధరించి క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేసుకుంటారు.అదేవిధంగా ప్రార్థనల అనంతరం కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు.

Good Friday Telugu Wishes | గుడ్ ఫ్రైడే | Top 10 Good Friday Telugu Quotes | Good Friday Greetings | Why we Celebrate Good Friday in Telugu | Good Friday Story in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading