Menu Close

Ye Nimishaniki Yemi Jaruguno Song Lyrics In Telugu

ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……

విధివిధానమును తప్పించుటకై….. ఎవరు సాహసించెదరూ…….

కంచెయె నిజముగ చేను మేసినా…… కాదను వారెవరూ……..
రాజే యిది శాసనమని పల్కిన….. ప్రతిఘటించు వారెవరూ………
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……

కరుణామయులిది కాదనలేరా….. కఠిన కార్యమనబోరా…..
సాధ్వుల కెపుడూ వెతలేనా……. తీరని దుఃఖపు కథలేనా……..
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……

ఇనకులమున జనియించిన నృపతులు…..యీ దారుణము సహించెదరా……
వినువీధిన శ్రేణులుగా నిల్చీ…. విడ్డూరముగా చూచెదరా…..
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……

ఎండకన్ను ఎరుగని యిల్లాలికి…. ఎందుకొ ఈ వనవాసాలూ….
తరచి చూచినా…. భోధపడవులే………. దైవ చిద్విలాసలూ………
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……

అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని…….. అనుమానించుట న్యాయమా…..
అల్పుని మాటయె జనవాక్యమ్మని…. అల్పుని మాటయె జనవాక్యమ్మని….అనుసరించుటే ధర్మమా……..
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……
విధివిధానమును తప్పించుటకై….. ఎవరు సాహసించెదరూ…….
ఏ నిమిషానికి ఏమి జరుగునో…. ఎవరూహించెదరూ……ఎవరూహించెదరూ……

Ye Nimishaniki Yemi Jaruguno Song Lyrics In Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading