నేటి రాశి ఫలాలు-Today Horoscope-10-05-2022 - Telugu Bucket
Menu Close

నేటి రాశి ఫలాలు-Today Horoscope-10-05-2022

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

మేషం:- అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. సొంత నిర్ణయాలతో ముందుకు వెళతారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక పరిస్టితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులు సహాయంగా ఉంటారు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది.

వృషభం:- శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. మంచి కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు.

మిథునం: – వృత్తి నిపుణులకు మంచి అభివృద్ది కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్సూర్తితో పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు.

కర్కాటకం:- వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

సింహం:- ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతు౦ది. వ్యాపారంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.

కన్య: – ఆదాయ వృద్దికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ది సాధిస్తారు.

తుల: – ఆర్థిక పరిస్టితి చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

వృశ్చికం:- ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది.

ధనస్సు: – ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల ను౦చి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

మకరం:- ఆర్థిక స్తోమత కాస్తంత పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

కుంభం:- ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతు౦ది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మీనం:– వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగ౦లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. సంతానం అభివృద్రిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading