Menu Close

ఇవి లైఫ్‌చేంజింగ్ హాబిట్స్ – The 7 Habits of Highly Effective People – స్టీఫెన్ కోవి


ఇవి లైఫ్‌చేంజింగ్ హాబిట్స్ – The 7 Habits of Highly Effective People – స్టీఫెన్ కోవి

మన జీవితం ఎలా ఉండాలనే దానిని మనమే నిర్ణయించుకోవాలి. విజయం పొందాలని ఆశించే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవాలి. స్టీఫెన్ కోవి రాసిన “The 7 Habits of Highly Effective People” అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను మార్చింది. ఈ పుస్తకంలో ముఖ్యమైన 7 అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరంగా చర్చిద్దాం.

writer, intelligent old and rich, think

ప్రొయాక్టివ్‌గా ఉండండి (Be Proactive):

  • మన జీవితాన్ని మనమే నియంత్రించుకోవాలి.
  • పరిస్థితులకు తలొగ్గకుండా సమాధానాల కోసం వెతకాలి.
  • మన ఓటమికి ఇతరులను నిందించకుండా, బాధ్యత మనమే తీసుకోవాలి.

చివరి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించండి (Begin with the End in Mind):

  • ఏ పని మొదలుపెట్టినా ముందుగానే దాని ఫలితాన్ని ఊహించాలి.
  • జీవితం లో లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి.

ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి (Put First Things First):

  • అవసరమైన, అత్యవసరమైన వాటి గురించి తెలుసుకుని, వాటిని ముందుగానే సిద్దం చేసుకోవాలి. వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
  • టైమ్ మేనేజ్‌మెంట్ చెయ్యడం నేర్చుకోవాలి.
  • ప్రయోజనం లేని పనులకు ఎక్కువ సమయం వృధా చేయకుండా ప్రయోజనకరమైన పనులపై దృష్టి పెట్టాలి.

గెలవడం-గెలపించడం ధోరణి కలిగి ఉండండి (Think Win-Win):

  • మనము లాభపడాలి, మనతో వ్యాపరం చేసేవారు లాభపడాలి అనే ఆలోచన కలిగి వుండాలి.
  • సహజీవనంలో, వ్యాపారంలో, వృత్తిలో అందరికీ లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకోవాలి.

ముందు అర్థం చేసుకోండి, తర్వాత అర్థం అయ్యేలా చెప్పండి (Seek First to Understand, Then to Be Understood):

  • మొదటిగా ఇతరుల మాట వినాలి, ఆ తర్వాత మన అభిప్రాయాన్ని చెప్పాలి.
  • అవగాహన పెంచుకోవడం, సహనం చూపించడం చాలా ముఖ్యమైన నైపుణ్యాలు.
  • కమ్యూనికేషన్‌ మెరుగుపడటానికి యాక్టివ్ లిసనింగ్ అలవాటు చేసుకోవాలి.

సమన్వయంతో పని చేయండి (Synergize):

  • జట్టు బలం వ్యక్తిగత బలం కంటే ఎక్కువ అని తెలుసుకోండి.
  • వేరువేరు ఆలోచనలను కలిపి, మెరుగైన పరిష్కారాలను కనుగొనాలి.
  • కలిసికట్టుగా పని చేస్తే, విజయాలు త్వరగా వస్తాయి.
  • మీ సామర్థ్యాన్ని పదునుపెట్టుకోండి (Sharpen the Saw):

మన మానసిక, శారీరక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శక్తులను నిరంతరం మెరుగుపరచాలి.
వినోదం, వ్యాయామం, పుస్తక పఠనం, ధ్యానం వంటివి అలువర్చుకోవాలి.
అప్డేట్ అవుతూ, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి.

ఈ 7 నిబంధనలను పాటించడం వల్ల వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు, వృత్తిపరంగా ఎదగవచ్చు, మరియు సంపూర్ణమైన జీవితం గడపవచ్చు.

ఈ నిబంధనల్లో మీకు బాగా నచ్చినది ఏది? కామెంట్ చేయండి! 😊

సునీతా విలియమ్స్: 8 రోజుల ట్రిప్ అనుకుంటే 8 నెలలు అయ్యింది – Sunita Williams, Butch Wilmore
కొన్ని సార్లు తగ్గడం కూడా ఒక గొప్ప వ్యూహమే – లైఫ్ లెసన్స్ – Life Lessons in Telugu
డబ్బు విషియంలో ధనిక మరియు పేదవారి మనస్తత్వాల ఎలా వుంటాయి –  Rich and Poor Mindsets

Like and Share
+1
1
+1
0
+1
0
Posted in Life Style

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading