Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
చాణక్య కష్టాలను ఎదుర్కోవడానికి ఏం చెప్పాడో తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరూ తమ చూపుని ముందుకు వెళ్లేటప్పుడు నేలపై ఉంచాలని సూచించాడు. ఎందుకంటే దారిలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. వాటిని దాటుకుని ముందడుగు వేయాలంటే ముందుచూపు తస్పనిసరి. లేదంటే అన్నివిధాలుగా నష్టపోతారు అని చెప్పాడు.
మనసు స్థిరంగా లేనివారు ఒక మాట నిలబడలేరు. స్పష్టంగా మాట్లాడలేరు.. ఏదో ఒకటి మాట్లాడుతూ నమ్మకం కోల్పోతారు. ఒంటరిగా మిగిలిపోతారు. మనసు స్థిరంగా ఉంటే అది ఏదైనా జరగనీయండి.. కానీ మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. లేదంటే జీవితంలో స్థిరత్వం అంటూ లేకుండా పోతుంది.
అలాగే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. శరీరం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలమని చెప్పాడు. ఇందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపాడు.
అయితే ఏ పని చేసినా మనస్పూర్తిగా చేయాలని నిండుమనసుతో చేస్తే ఎదైనా సాధించవచ్చని తన చాణక్య నీతిలో వివరించాడు. ఒక్క సారి సరైన నిర్ణయం తీసుకుంటే ఇక తడబడకుండా ముందుకు వెళ్లాలని సూచించాడు.
అబద్దాలు చెప్పే వ్యక్తులు కష్టాలపాలవుతారని చెప్పాడు. అబద్దాలు చెప్పకుంటూ పోతే జీవితమే ఒక అబద్దం అవుతుందిని.. మనకు ఎవరూ విలువ ఇవ్వరని తెలిపాడు. ఒక్క అబద్దం వంద అబద్దాలు ఆడేలా చేస్తుదిని అందుకే ఏదైనా సరే నిజమే మాట్లాడాలని సూచించాడు.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.