Telugu Stories – మనం చెయ్యగలిగిన సేవ ఎంత చిన్నదైన అది మనకి ఎంతో సంతృప్తిని ఇస్తుంది
ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు. అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.
హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను. నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు. ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.
ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను. ‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను. అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను.
అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు. ‘’కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు థాంక్స్ చెప్తారు. ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.
నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను. మనం ధనవంతులం ,స్తితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైన “ధనవంతుడే” అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల *సంతృప్తి* *మరెందులోనూ రాదని అర్థమైంది.
దయచేసి సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి. మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం. మానవసేవే మాధవసేవ.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.