Menu Close

అద్బుతమైన కథ-మనిషిగా పుట్టడమే ఒక వరం-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నిద్ర నుంచి మేల్కొన్నాను… అలవాటు ప్రకారం భార్యని పిలిచాను…మాట బయటికి రాలేదు…ఏమైందా…? అని మరోసారి గొంతు చించుకుని అరిచాను…ఏదో కీటకం గొంతు వినిపించింది. ఈ రోజుల్లో కీటకాలు అధికమయ్యాయి అనుకుంటూ బెడ్ మీద నుంచి కిందికి దిగటానికి ప్రయత్నించాను తెల్లటి నేల… 100 అడుగుల లోతు ఉన్నట్లు కనిపించింది. అసలు ఏమీ అర్థం కాలేదు…ఎక్కడున్నాను…? నేను…? అనుకుంటూ చుట్టూ చూశాను.

మా ఇంట్లోనే ఉన్నాను… కానీ ఇల్లు చాలా పెద్దదిగా కనిపించింది.పెద్ద రాజభవనం కంటే పెద్దది… అలా ఎలా మారిపోయింది…? నాకు దృష్టిలోపం వచ్చిందా….? కళ్ళు మూసి తెరిచి చూశాను… పరిస్తితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. సన్న రెండు వెంట్రుకలు లాంటిది ఏదో కనిపించింది. నా చేతులు ఏవీ…? అసలు నాకు ఏం జరిగింది…??? చుట్టూ చూశాను… అద్దం కనిపించింది. అద్దం సమీపించి నన్ను నేను అద్దంలో చూసుకోవాలి అనే కోరిక కలిగింది….!

అంతే నా శరీర భాగం నుంచి తెల్లటి దారం బయటికి వచ్చింది. ఎదురుగా కనిపిస్తూన్నా గోడకు తగిలి అతుక్కుంది. దారం తో పాటు నా శరీరం గాల్లో ఎగురుతూన్నట్లు అనిపించింది. ఇదేదో వింతగా ఉంది అనుకుంటూ అద్దంలో చూశాను. నా కళ్ళకు ఎవరూ కనిపించలేదు ఓ స్పైడర్ మాత్రమే కనిపించింది. కిటికీ నుంచి బలమైన గాలి వీచింది. ఎగిరి కింద పడ్డాను. తిరిగి అద్దంలోకి చూడాలి అనుకున్నాను. ఇంతకుముందు వచ్చినట్లే తెల్లటి దారం బయటకు వచ్చింది. ఈసారి గాలి వేగం అధికంగా ఉండటంతో ఆ ధారం గోడకు తగలలేదు. అద్దానికి తగిలింది.శరీరమంతా గాల్లోకి ఎగిరి అద్దంపై వాలను అదిగో అప్పుడు తెలిసింది. నేను స్పైడర్ ని…అయ్యాను అనే విషయం. ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు…ఎలా జరిగింది…?

గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను లీలగా గుర్తుకు వచ్చింది. తెల్లవారుజామున కల వచ్చింది. కలలో దేవుడు ప్రత్యక్షమై 5 వరాలు ఇచ్చాడు. అది గుర్తుకు వచ్చింది

“మొదటి వరం కోరుకో కానీ నియమం స్వార్థం కోసం కోరుకోకు…” అన్నారు నేను వినిపించుకోలేదు. మొదటి కోరికగా “ఎక్కువ కష్టపడకండానే సొంత ఇల్లు కట్టుకునే వీలు కల్పించాలి” అన్నాను” తథాస్తు…

రెండవ వరం కోరుకో…! “కూర్చున్న ప్రదేశంలో ఆహారం రావాలి…!” “తథాస్తు…!

మూడవ వరం కోరుకో…””నాదైన కుటుంబం ఉండాలి…”” తథాస్తు…

నాలుగో వరం కోరుకో….”ఏం కోరుకోవాలి అని ఆలోచించాను చిన్ననాటి స్పైడర్ మాన్ లా గాలిలోకి ఎగరాలి….దుంకలి అనందంగా వుండాలి అనే కోరిక ఈ సమయంలో గుర్తు వచ్చింది. వెంటనే “నేలపై నుంచి ఎగరాలి” కోరుకున్నాను ఆ తరువాత మెలుకువొచ్చింది. తీరా చూస్తే స్పైడర్ ని అయ్యాను…

కష్టపడి సంపాదించకముందే ఇల్లు కట్టుకునే నైపుణ్యం స్పైడర్ సొంతం…ఆహారం ఈగ రూపంలో ఇంట్లో(వల) ప్రత్యక్షమైంది. మూడో కోరిక ప్రకారం ప్రత్యుత్పత్తి జరిపి పిల్లల్ని కన్నాను… స్వేచ్ఛగా గాల్లోకి ఎగురుతున్నాను. కానీ నేను కోరుకున్నది ఈ రకమైన జీవితం కాదు. దేవుని పై కోపం వచ్చింది. దేవుని తలుచుకుని “దేవా నాకు కావాల్సింది ఈ జన్మ కాదు తిరిగి నన్ను మనిషిగా మార్చు” కోపంగా అన్నాను. మాట బయటకు రాలేదు. కానీ విచిత్రంగా చూస్తూ ఉండగానే మనిషిని అయ్యాను. అప్పుడు గుర్తుకు వచ్చింది ఇదో వరం. అమ్మయ్య బ్రతికి పోయాను అనుకున్నాను… స్వార్థంతో నిండిన జీవితం జంతువు జీవనం లాంటిది.

మనిషిగా పుట్టడమే ఒక వరం, అది కాదని అలా పుడితే బాగుండు ఇలా పుడితే బాగుండు అని కోరుకోవడం ముర్కత్వమే..

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading