Menu Close

చింతిస్తే పోగొట్టుకున్నవి రావు – Telugu Moral Stories

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

చింతిస్తే పోగొట్టుకున్నవి రావు – Telugu Moral Stories

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu

భీష్ముడు ” ధర్మనందనా ! నముచిని గురించి వినిపిస్తాను. పూర్వము నముచి అనే రాక్షసుడు ఉండే వాడు. అతడికి ఉన్నసంపద అంతా పోయింది. అయినా అతడు చింతపడక ఏకాంతస్థలంలో సంతోషంగా ఉన్నాడు.

అతడి వద్దకు ఇంద్రుడు వచ్చాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చి ” దానవరాజా ! ఉన్న సంపద పోగొట్టుకుని ఆదరించే వాళ్ళు లేక పేదరికంలో మగ్గుతున్నందుకు ఎంత చింతిస్తున్నావో కదా ! ” అని అన్నాడు.

నముచి ” దేవేంద్రా ! పోయిన సంపదకొరకు చింత ఎందుకు చింతపడితే పోగొట్టుకున్నది వస్తుందా విచారించడము నిరర్ధకము కాదా ! అలారాక పోగాచింత, దుఃఖము మిగులుతాయి. ఇదంతా తెలుసు కనుక నేను పోయిన వాటి కొరకు దుఃఖించడం లేదు.

దేవేంద్రా ! ముల్లోకాలనూ శాసించే వాడు ఒకడు ఉన్నాడు. నీరు పల్లముకు పారినట్లు మనము కోరుకున్నవన్నీ మన వద్దకు వస్తాయి. అయినా ఇది నాకు జరగవలసినది అందుకే ఇలా జరిగింది అనుకుంటే దిగులు, చింత, సంతోషము ఆనందము ఎందుకు వస్తాయి ” అన్నాడు.

మనకు ప్రాప్తము లేని దానిని మనము మన పరాక్రమముతోనూ , ధైర్యముతోనూ, వీరత్వముతోనూ, ప్రజ్ఞతోనూ, శౌర్యముతోనూ సాధించ లేము. ఈ విషయము తెలుసుకున్న బుద్ధిమంతుడు ఈ విషయం ఎరిగి లేని దానికొరకు చింతించడు. దేవేంద్రా ! మేలు కీడు అనేవి మనము కోరుకుంటే రావు వద్దంటే పోవు. కనుక వాటి కొరకు ఆరాటపడడం తగదు ” అన్నాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading