ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories
చెట్టున ఉన్న పళ్ళు కోసుకుందామని ఓ వ్యక్తి చెట్టెక్కాడు. కావలసినన్ని పళ్ళు కోసుకుని దిగే ప్రయత్నం చేసాడు. ఎక్కేటప్పుడు ఉన్నంత సులభం దిగేటప్పుడు లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా దిగడం చేతకాలేదు. చెట్టు మీదినుండి దూకడం ఒకటే మార్గం అనుకున్నాడు.
కాలో, చెయ్యో విరుగుతుందేమో అని భయపడి పెద్దగా “రక్షించండి…. రక్షించండి” అంటూ కేకలు వేసాడు. అటువైపు పోతున్న వాళ్ళలో ఒక పెద్దమనిషి సహాయం చేద్దామనుకొని ఒక తాడు తెప్పించి ఒక చివర చెట్టు మీదున్న అతనికి విసిరి నడుముకు కట్టుకోమన్నాడు.
రెండో చివర తన నడుముకు కట్టుకొని తాడును గట్టిగా కిందికి లాగాడు. చెట్టు మీది వ్యక్తి దబ్బున కింద పడ్డాడు. అందరూ ఫక్కుమని నవ్వారు. “అయినా ఇదేం పని” అంటూ ఆ పెద్దమనిషిని నిలదీసారు. పెద్దమనిషి తలగోక్కుంటూ, “ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకరిని రక్షించాను, అయితే ఇలా జరగలేదు.”
“ఇలా జరగలేదా!!” అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ మనిషి బావిలో ఉన్నాడు. గట్టిగా లాగితే పైకి వచ్చాడు” అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు. మళ్ళీ అందరూ పగలబడి నవ్వారు. ప్రతి సమస్యకూ ఒకే రకమైన పరిష్కారం ఉండదు ఆలోచించండి, సక్రమంగా ఆచరించండి.”
సేకరణ – V V S Prasad