ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఐశ్వర్యం, ప్రేమ, విజయం ఈ మూడిట్లో మీకేం కావాలి – Telugu Short Stories
ఓ స్త్రీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అరుగు మీద ఓ ముగ్గురు పండు ముత్తైదువులు కూర్చుని ఉండడం చూసి, “మీరెవరో ఏమో!! భోజనం చేసిపోండి” అని ఆహ్వానించింది. వాళ్లు ఐశ్వర్యం, ప్రేమ, విజయం.
“మీ ఆయన ఇంట్లో ఉన్నారా” అని అడిగారు. “లేరు, బయటికి వెళ్లారు” “అయితే లోపలికి రాలేం!” అన్నారు ఆ స్త్రీలు. ఆ సాయంత్రం భర్త ఇంటికి రాగానే జరిగినదంతా చెప్పింది. “వాళ్ళని ఇప్పుడే భోజనానికి రమ్మను” ఆహ్వానించాడు.
“మేం ముగ్గురం ఒక్కసారిగా రాలేం. మా పేర్లు ఐశ్వర్యం, విజయం, ప్రేమ. ఇప్పుడు ఎవరు రావాలో నీ భర్తని కనుక్కో” ఆమె ఇంట్లోకి వెళ్లి ఈ విషయం వివరిస్తే భర్త ఆనందం పట్టలేక “ఐశ్వర్యాన్ని రమ్మను. ఐశ్వర్యంతో నిండిపోవాలి ఇల్లు”
భార్య “విజయాన్ని పిలుద్దాం, దాంతో ఐశ్వర్యం వస్తుంది” తెలివైన కోడలు మధ్యలో కల్పించుకుని, “బయటికి వెళ్లి ప్రేమను భోజనానికి ఆహ్వానించండి” “మీలో ప్రేమ ఎవరో భోజనానికి రావచ్చు” అంటూ ఆహ్వానించింది. ప్రేమ ఇంట్లోకి అడుగుపెట్టింది. మిగిలిన ఇద్దరు కూడా ప్రేమ వెంట లోపలికి నడిచారు.
ఆశ్చర్యపోయిన గృహిణి “నేను ప్రేమను మాత్రమే ఆహ్వానించాను. మీరు కూడా వస్తున్నారు” అనింది. అప్పుడు వాళ్ళు “ఐశ్వర్యాన్ని కానీ విజయాన్ని కానీ ఆహ్వానించి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం, ప్రేమను ఆహ్వానించారు ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం, విజయం వెన్నంటి ఉంటాయి”
అపారమైన ప్రేమ కలిగి ఉంటే దేనికి లోటు ఉండదు.
సేకరణ – V V S Prasad