ఒక గోడ బదులు వంతెనను కట్టి చూడు - Best Stories in Telugu - Telugu Bucket
Menu Close

ఒక గోడ బదులు వంతెనను కట్టి చూడు – Best Stories in Telugu

ఒక గోడ బదులు వంతెనను కట్టి చూడు – Best Stories in Telugu

చాలా ఏళ్ళ నుండి అన్నదమ్ములిద్దరూ పక్క పక్క పొలాల్లో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు. ఒకరోజు ఎందుకో ఒకరి మీద ఒకరికి కోపం వచ్చింది. మాటామాటా అనుకున్నారు, తిట్టుకున్నారు. అంతటి స్నేహం తెగి పోయింది. మాటలు లేవు. శత్రువులుగా మారిపోయారు. ఇద్దరి పొలాల మధ్య తమ్ముడు కాలవ తొవ్వించి వైరాన్ని మరింత పెంచాడు.

ఒకరోజు ఒకతను, అన్న ఇంటికి వచ్చి “నేను వడ్రంగిని. ఏదైనా పని ఇప్పించండి. చేసి పెడతాను, మీకు తోచింది ఇవ్వండి” అని ప్రాధేయపడ్డాడు. “కోపం వచ్చి మా తమ్ముడు ఈ రెండు పొలాల మధ్య ఈ కాలవ తవ్వించాడు. నాతో మాట్లాడడం లేదు. నేను వాడి మొహం కూడా చూడకూడదని అనుకొంటున్నాను.

అదుగో చెక్క ముక్కలు, వాటితో వాడి మొహం చూసే అవసరం లేకుండా ఎత్తైన పెద్ద కంచె కట్టు. నాకు చిన్న పని ఉంది. సాయంత్రానికి వస్తాను” అంటూ
వెళ్లిపోయాడు. వడ్రంగి పనిముట్లు తీసుకుని రోజంతా కష్టపడి పని చేసాడు. సాయంత్రానికి అన్న వచ్చి చూసేసరికి అక్కడ కంచె లేదు సరికదా! కాలవను కలుపుతూ వంతెన కనిపించింది.

అంతేకాదు అటు నుండి ఆనందంగా తమ్ముడు వచ్చి అన్నను కౌగలించుకొని “అన్నయ్యా ! నిన్ను ఎన్నిమాటలన్నాను. అయినా కూడా నీవు వంతెన కట్టించావంటే ఎంత మంచి వాడివన్నా!” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు. వడ్రంగిని అక్కడే ఉండి పని చేసుకోమన్నారు. “ఆ వడ్రంగి క్షమించండి, నేను కట్టాల్సిన వంతెనలు చాలా ఉన్నాయి”

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading