ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జై జవాన్ – Telugu Short Stories
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో, ఖ్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ ఓ 24 ఏళ్ల యువ సైనికుడు ₹100/- మాత్రమే డ్రా చేసి తీసుకెళ్లేవాడు. అక్కడ ఉన్న వాచ్ మెన్ అతను అలా ప్రతిరోజూ ఎందుకు విత్ డ్రా చేసి తీసుకెళ్లేవాడో అర్థంకాక జుట్టు పీక్కునేవాడు. ఒక రోజు ధైర్యం చేసి వాచ్ మెన్ సైనికుడిని అడిగాడు.
“నువ్వు రోజూ₹100/ మాత్రమే ఎందుకు విత్ డ్రా చేసి తీసుకెళ్తున్నావు” అని. దానికి ఆ జవాన్, “నాకు ఈమధ్యనే పెళ్లి అయింది. ఈ కల్లోల కాశ్మీరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడే అవకాశం లేదు. నేను డబ్బులు విత్ డ్రా చేస్తే నా బ్యాంకు అకౌంట్ కు లింకైన ఫోన్ నెంబర్ కు మెసేజ్ వెళ్తుంది.
ఆ ఫోన్ నా భార్య దగ్గర ఉంటుంది. దీని వల్ల నేను ఇంకా బ్రతికే ఉన్నానని మా ఇంటివాళ్ళకు తెలుస్తుంది. వరుసగా రెండు రోజులు ఫోన్ కు మెసేజ్ రాకపోతే నేను శాశ్వతంగా భరతమాత ఒడిలో నిద్రపోయానని తెలుస్తుంది.” అని సగర్వంగా చెప్పాడు.
సేకరణ – VVS Prasad