జాతి శెల్యూట్ చేయదగిన వ్యక్తిత్వాలు - Real Stories in Telugu - Telugu Bucket
Menu Close

జాతి శెల్యూట్ చేయదగిన వ్యక్తిత్వాలు – Real Stories in Telugu

జాతి శెల్యూట్ చేయదగిన వ్యక్తిత్వాలు – Real Stories in Telugu

అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి ఊటీ వెళ్లారు. అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాం మానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని! 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఆయన మన ఆర్మీ చీఫ్. ఆయనను పరామర్శించాలని నిర్ణయించుకుని నేరుగా వెళ్లాడు.

మానిక్ షా బెడ్ పక్కనే కూర్చుని ఆరోగ్య స్థితిని కనుక్కున్నాడు. తిరిగి వెళ్లిపోయే సమయంలో, “ఇక్కడ సౌకర్యంగా ఉందా? నేను చేయగల సాయం ఏమైనా ఉందా?” అన్నాడు కలాం.

“ఓ అసంతృప్తి సార్ !” అన్నాడు మానిక్ షా.

“ఏమిటది.?” కలాం మొహంలో ఆశ్చర్యం. “నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి శెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్.” అన్నాడు కళ్లు తుడుచుకుంటూ. కలాం కళ్లల్లో కూడా తడి…

షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కాడు… – “సార్, చిన్న రిక్వెస్టు, ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదు!” చెప్పాడు షా. కలాం ఢిల్లీ వెళ్లగానే షా పెన్షన్ ఫైల్ తెప్పించుకుని తగిన ఆదేశాలు జారీ చేసారు. వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిల చెక్కును ఊటీకి పంపించారు. దటీజ్ కలాం! ఇక్కడే చిన్న ట్విస్టు,

ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండు డొనేట్ చేసాడు. దటీజ్ షా! వావ్!! ఎవరు ఎవరికి శెల్యూట్ చేయాలి? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. జాతి శెల్యూట్ చేయదగిన వ్యక్తిత్వాలు

సేకరణ – V V S Prasad

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading