Telugu Short Stories, Funny Telugu Stories
పిచ్చేశ్వర్రావ్ పేపర్ చదువుకుంటుంటే వెనక నుండి అతని భార్య నెత్తిమీద అట్లకాడతో ఒకటంటించింది. “ఎందుకొట్టావ్ ??” అడిగాడు తల తడుముకుంటూ.
“నీ జేబులో జాస్మిన్ అని రాసిన కాయితం ఉంది, ఎవరా జాస్మి న్ !!! “పళ్ళు పటపట కొరుకుతూ అడిగింది. “ఓ అదా….. రేపు రేసులో ఆ గుర్రం గెలుస్తుందట!!” నీళ్ళు నములుతూ చెప్పాడు.

మూతి మూడు వంకర్లు తిప్పుతూ వెళ్లి పోయింది భార్యామణి. మూడు రోజుల తర్వాత మళ్లీ పిచ్చేశ్వర్రావ్ పేపర్ చదువుతూ ఉంటే, నెత్తి మీద ఇంకొంచెం గట్టిగా అట్లకాడ దెబ్బ తగిలింది. “ఎందుకూ…… !!” నెత్తి రుద్దుకుంటూ అడిగాడు. శ్రీమతి రుసరుసలాడుతూ, “మీ గుర్రం ఫోన్ చేసింది…”
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket
Like and Share
+1
+1
+1
+1
+1