అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
గెలిచిన వారి మాటలు వింటే మనం కూడా సగం గెలిచినట్టే అనిపిస్తుంది. వారిలా మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనిపిస్తుంది. ఓడిపోయిన వారి మాటలు కూడా వినిపించుకోవాలి అనుభవపాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు. ఈయన హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ తన పదహారో ఏట అమెరికాలో స్థిరపడతాను అన్నప్పుడు అతడిని చూసి అందరూ నవ్వారట
అయన అమెరికాలో స్థిరపడ్డారట అయన 18 ఏట ప్రపంచ ఆజానుబాహుడిగా గెలుస్తాను అన్నపుడు అందరూ నవ్వారట, ఆయన ఆ బిరుదును చాలా సార్లు గెలుచుకున్నారట, అయన హాలీవుడ్ స్టార్ అవుతాను అంటే అందరూ నవ్వారట, అయన హాలీవుడ్ స్టార్ అయ్యారట, హాలీవుడ్ చిత్రాలలో అయన తగ్గినప్పుడు ఇక అయన పతనమైపోయాడని మాట్లాడి నవ్వుకున్నారు.
అయన మళ్ళీ నిలదొక్కుకున్నాడు అయన తన 50 ఏట కాలిఫోర్నియా గవర్నర్ అవుతాను అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. అయన 38 వ గవర్నర్ అయ్యారు కాలిఫోర్నియాకు. అయన ఒక్కసారి ఆ స్థాయి నుండి వెనక్కు తిరిగి తనను చూసి నవ్వినవారిని చూసారు ఇంకా అక్కడే ఉన్నారు.
వాళ్లంతా ఎవర్నో ఒకరిని హేళన చేస్తూ మన చుట్టూ ఉండి మనల్ని హేళన చేసినవారిని మనల్ని చులకనగా మాట్లాడిన మాటల్ని పట్టించుకోరాదు. మన ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపించాలి మనపైన మనకు నమ్మకం ఉండాలి ఎదుటివారికి మన బలం ఏం తెలుస్తుంది హేళన చేసినవారికి మన ఆత్మబలం గురించి ఏం తెలుస్తుంది మనం ఎప్పుడూ మన కష్టాన్ని శ్రమను నమ్ముకుంటే చాలు మన పట్టుదలే మన విజయాలకు కారణం కదా ….