Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

తనకై నిరీక్షణ బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తున్న నాకు వైషూ..కనిపించింది-Telugu Stories

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

తనకై నిరీక్షణ బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురు..చూస్తు….వైషూ..కనిపించింది….నా సంతోషానికి హద్దులు లేవు … నన్ను చూసింది…పలకరింపు గా నవ్వింది…అంతే…దగ్గరికి వెళ్ళి పలకరించాను….ఎంత మార్పు తనలో….ఒకప్పుడు..పున్నమి వెన్నెలలా….కదిలే కడలి అలలా…గల గల పారే సెలయేటి సవ్వ డిలా…అద్భుతంగా ఉండేది….

ఇప్పుడేమో..శోక దేవత లా అనిపించింది..ఇద్దరం ఒకే ఊరికే ప్రయాణం…తనని చూసిన ఉత్సాహం నాలో…కానీ..తనలో ఏ భావం లేదు .. బస్ ఎక్కి కిటికీ పక్కగా కూర్చుంది….నాకేమో తన పక్కనే కూర్చోవాలి అనిపించింది.. కానీ ఎందుకో..వైషూ ముభావంగా ఉండడం తో…వెళ్లి దూరంగా కూర్చున్నా….

మధ్య మధ్య లో తననే చూస్తున్నా…చూసి చూడనట్టు చూస్తోంది…కానీ…నా పై ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తోంది…వైషూ ” నేను…..అగ్ని సాక్షిగా తాళి కట్టిన నా భార్య …

చదువు పూర్తయి బెంగళూరు లో జాబ్ చేస్తున్నప్పుడు… కొలీగ్ ..గా.,వైష్ణవి పరిచయం అయింది… కొద్ది రోజుల్లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ..తన చూపులతో సూర్యోదయాలు .తన పలుకులతో… పొన్నాగ పూల జల్లులుతన సాహచర్యం లో …అంతులేని సంతోషాలు…ఎంతో సంతోషంగా సాగిపోయేవి ఆ రోజులు…

రోజూ ఆఫీస్ అయిపోగానే..రూమ్ కు చేరుకుని…చాలా సేపు ..గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడిని…నిజానికి వైషూది..మా పొరుగు ఊరు….చదువయ్యాక జాబ్ కోసం…బెంగళూరు కు వచ్చాకే నాకు పరిచయం అయింది…తన అమాయకత్వం నన్నెంతగా నో ఆకట్టుకుంది…

తన నవ్వు ముత్యమంత స్వచ్చన….తన చూపుతో…ఎక్కడ లేని సమ్మోహనం..నా మదికి చేరి…గిలిగింతలు పెట్టేది….తనకంటే నేను జాబ్ లో సీనియర్ ని…వర్క్ విషయం లో..వైషూ.. ఎక్కువగా నా హెల్ప్ తీసుకునేది…ఇద్దరి కుటుంబ నేపథ్యాలు..ఆర్థిక పరిస్థితి లో అంతంత మాత్రమే…వైషూ వాళ్ళ నాన్న గారు..చికెన్ షాప్ నడిపేవారు…

వైషూ వాళ్ళ అమ్మ గారికి కొద్దిగా అనారోగ్యం……ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు…వైషూ కు ఒక చెల్లి..ఇద్దరు తమ్ముళ్ళు…ఆ ఇంట్లో తనే పెద్దమ్మాయి…కష్టపడి చదువుకుంది…ఉద్యోగం చేస్తూ ..ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనే తపన..పట్టుదల వున్న అమ్మాయి..ఉద్యోగం చేసే చోట కూడా…అందరితో కలుపుగోలుగా వుంటూ…కల్మషం లేని చిరునవ్వు తో అందరినీ పలకరించేది…

చిన్నప్పటి నుంచి నాకు కొంచెం కోపం ఎక్కువ…మా ఇంట్లో అమ్మ..నాన్న..నేను..ఇంకా నా ఇద్దరు చెల్లెళ్ళు…కాలేజ్ చదివే రోజుల్లో కూడా..అమ్మాయిలంటే పెద్ద ఇంట్రెస్ట్ వుండేది కాదు…చాలా సీరియస్ గా నా పని నేను చేసుకు వెళ్ళే టైప్….అలాంటిది…వైషూ అంటే మాత్రం..రోజు రోజు కీ ఆకర్షణ పెరిగి పోతూ ఉంది… అంత పెద్ద సిటీ లో…అందరు కొత్త వాల్లున్న చోట..వైషూ కు నేను చాలా దగ్గరగా అనిపించాను…చాలా క్లోజ్ గా మాట్లాడేది…

ప్రతి నెలా ఇంటికి వెళ్లి వచ్చేది…..ఇంటి కి వెళ్లి వచ్చాక…చాలా డల్ గా ఉండేది…తనతో రూమ్ లో ఉండే అమ్మాయి..పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం తో రూం లో ఒకతె ఉండేది….అప్పుడే మా ఇద్దరికీ ఒక ఆలోచన వచ్చింది..వైషూ ని తన రూమ్ ఖాళీ చేయించి..మా రూం కు లగేజ్ షిఫ్ట్ చేయించాను…ఇద్దరం ఒకే రూమ్ లో…కానీ ..ఎప్పుడు హద్దులు దాటలేదు..వైషూ ను నా బాధ్యత అనుకున్నాను..

నాక్కూడా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి..ఒక ఆడపిల్ల నను నమ్మి నాతో ఉంటోంది అని..చాలా నమ్మకంగా ఉండే వాడిని…అదే టైం లో ఒక రోజు విపరీతమైన జ్వరం నాకు…కదల్లేని స్థితిలో వున్నా..ఆ సమయం లో వైషూ చేసిన సేవలు..నిజంగా మా అమ్మ ను మరిపించేసాయి….అనుక్షణం ..వైషూ….పసిపాపల చూసుకుంది నన్ను….కరిగిపోయా తన లోని ప్రేమ తత్వానికి….నేను కొలుకున్నాక…ఒకసారి ఊరెళ్ళి వస్తాను అని చాలా అర్జెంటు గా వెళ్ళింది….

ఈ సారి ఊరి నుండి తిరిగి రావడానికి కనీసం పదహైదు రోజులు పడుతుంది అని చెప్పింది…ఎందుకో..వైషూ ఊరెళ్ళి నప్పట్నించి…మనసంతా..దిగులు…చీకటి.. అలుముకుంది…జాతర లో తప్పి పోయిన చిన్న పిల్లాడు…తల్లి కోసం వెతుక్కుంటు..తల్ల డిల్లినట్టు అనిపించింది…ఏది సహించడం లేదు…ఆకలి లేదు..నిద్ర లేదు…అప్పుడే అనిపించింది…వైషూ ను ప్రేమిస్తున్నాను అని..ఎలాగైనా ఈ విషయం వైషూ కి చెప్పి…పెద్దలలో మాట్లా డి….వైషూ ని పెళ్లి చేసుకోవాలి అనిపించింది…

అందునా ఇద్దరిదీ ఒకే కులం……కాబట్టి..ఇక పెళ్లి కి దాదాపు ..ఇరు వైపులా…పెళ్లికి సుముఖత వుంటుంది అని ఆలోచించా….నా విరహాన్ని భగ్నం చేస్తూ… ఊరి నుంచి బయలుదేరి ..బెంగళూరు కు వచ్చింది వైషూ……ముభావంగా ఉంది..ఎక్కువ మాట్లాడటం లేదు…నేను ఆఫీస్ హడావిడి లో ఉండి…వెళ్ళిపోయా…ఆ రోజు ఆఫీస్ నుండి తిరిగొచ్చాక ఒక విషయం తెలిసింది..తనకు పెళ్లి చూపులు జరిగాయి అని చెప్పింది…నా గుండెలో అలజడి..ఆందోళన….అడిగా..ఆ పెళ్లి తనకు ఇష్టమా..కాదా..అని…తన ఇ ష్టం తో సంబంధం లేని పెళ్లి అని చెప్పింది…

తనకు పెళ్లి అనగానే..నాలో ఏదో బాధ…సరే అని…నేను రూం లో నుండి బయటకు వెళ్లిపోయానుఇక..ఆ రాత్రంతా.. పిచ్చోడి లా ఎక్కడ పడితే అక్కడ తిరిగా..మరుసటి రోజు ఉదయం ఫోన్ రింగ్ అవుతుంటే మేలుకొని చూసా..47 మిస్డ్ కాల్ లు..12 మెసేజ్ లు…అన్ని వైషూ నుండే….నిదానంగా రూమ్ కు వెళ్ళా. వైషూ…చాలా కోపంగా మాట్లాడింది…ఇక నాకు బాధనిపించింది…

నా మనసులో తన పై ఉన్న ప్రేమ ను చెప్పాను…తను ఏమి సమాధానం చెప్పలేదు…ఆ రోజంతా..ఇద్దరం ఎక్కువగా పలకరించు కోలేదు…మరుసటి రోజు ఉదయాన్నే…వైషూ నా ప్రేమ కు తన అంగీకారాన్ని తెలిపింది….తన కుటుంబ బాధ్యతల గురించి కూడా చెప్పింది..పెళ్లి తర్వాత…నేను కూడా బాధ్యతల్లో భాగం పంచుకుంటాను అని చెప్పాను….ఇక ఆలస్యం చేయకుండా..

సెలవు పెట్టీ ఎవరి ఊర్లకు వాళ్ళం వెళ్ళిపోయాం…మా ఇంట్లో అమ్మ నాన్న ను ఒప్పించి…వైషూ వాళ్ళింటికి తీసుకెళ్ళి..పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించాం…పెళ్లి సమస్య తీరిపోయింది…చూస్తుండగానే వైషూ..కొత్త కోడలిగా మా ఇంట్లోకి..నా ప్రాణ దేవత గా నా గుండె గుడి లోకి అడుగు పెట్టింది…జీవితం లో తన రాక …కొత్త వసంతా నికి స్వాగతం పలికింది….మా ఇద్దరి మధ్య అన్యోన్యత….చూసేవాళ్లకు చిలకా గోరింక ల్లా అనిపించే వాళ్ళం…ఒక నెల రోజులు కాలం కూడా తెలియనంతగా గడిపేసాము….తర్వాత నుండి అసలు సమస్యలు మొదలయ్యాయి…

మా ఇంట్లో కొత్త పెళ్లి కూతురైన…వైషూ..ఇంటెడు పనులు చేయడం..పైగా మా అమ్మ ఏమో..పుల్ల విరుపు మాటలు…మా అమ్మ నైజం అంతే… ఏ పని అయినా పద్ధతిగా చేయాలి అంటూ….వైషూ కూడా ఓపిక ఉన్న అమ్మాయి…కాకపోతే..అమ్మ అనే చిన్న చిన్న మాటలకు బాధ పడుతూ ఉండేది…రోజు ఏదో ఒక విషయం లో..అమ్మతో..మాటలు పడేది…వైషూ.. ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఉంటూ ఉండేది…స్టౌ మీద కూరలు మాడిపోవడమో..లేకుంటే..పాలు పొంగి..స్టౌ గట్టు చుట్టూ పేరుకుపోయిన .. మరకలు వుండటమో చూసి మా అమ్మ మందలించేది…

ఇక ఆ రోజంతా దిగులుగా ఉండేది వైషూ….పెళ్లయిన రెండు నెలలకు కొత్త దంపతులం తిరుపతి వెళ్ళొస్తే మంచిదని…నేను..వైషూ బయలుదేరాం…చివరి నిమిషం లో నా చెల్లెళ్ళు కూడా మాతో పాటు తిరుమల కు వచ్చారు..అక్కడ దర్శనం తర్వాత…మా చెల్లెళ్ళు..చాలా వస్తువులు షాపింగ్ చేసి తీసుకున్నారు…వైషూ కూడా తన చెల్లికి..తమ్ముళ్లకు ఏదో షాపింగ్ చేసింది…ఏం జరిగిందో ఏమో..నా పెద్ద చెల్లి…వైషూ..ముభావంగా వుండి ఒకర్నొకరు పలకరించు కోవడం మానేశారు…తర్వాత తెలిసింది..నా చెల్లెలు…” మా అన్న డబ్బులన్నీ. వదిన కే సరిపోతాయి…మా అన్న ఈమె వచ్చినప్పటి నుండి మారిపోయాడు..అని..ఇంకో చెల్లి తో అంటుంటే..వైషూ విందట.,

ఇక..అంతే…తిరుమల టూర్ మూడ్ మొత్తం పాడు చేసేసారు…iఇలాగే అన్ని చిన్న చిన్న సమస్యలు…చివరికి మాత్రం..తీవ్రమైన సమస్యలు అయ్యాయి…

మరో రెండు నెలలు ఆగి..నేను..వైషూ బెంగళూరు వెళ్ళిపోయాము…తిరిగి జాబ్ లో జాయిన్ అయ్యాం…..ఇద్దరి మధ్య..ఎంతో ప్రేమ..అప్పుడప్పుడు అలకలు…తరువాత జరిగే సర్దుబాట్లు..తుఫాను వెలిసిన ప్రశాంతం గా సాగిపోయేది సంసారం…పెళ్లయి ఆరు నెలలు పూర్తి అయింది….ఆ రోజు వైషూ కి సర్ప్రైజ్ ఇద్దాం అని…తనకు తెలియకుండా..ఇంట్లో ఫ్రెండ్స్ తో డిన్నర్ ప్లాన్ చేశాను..

ఆఫీస్ లో..మా ఫ్రెండ్స్..త్వరగా మా ఇంటికొచ్చి…వంటలు చేయడం మొదలు పెట్టాము..ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను..దానికి ఇంకో కారణం వుంది…ఆ రోజు ఉదయం..వైషూ.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది…తను రెండో నెల గర్భవతి…అయిన తను నాకు చెప్పలేదు…ఆ టెస్ట్ చేసుకున్న స్ట్రిప్ నాకు కనపడి…నేను తెలుసుకుని..మురిసిపోయాను…బహుశా..సాయంత్రం నాకు చెప్తుంది అనుకున్నాను…

ఆ రోజు సాయంత్రం నుండి తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది…రాత్రి భోజనం టైమ్ కు కూడా వైషూ ఇంటికి రాలేదు..వచ్చిన ఫ్రెండ్స్..భోంచేసి వెళ్లిపోయారు…రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి…నేను చేసిన డిన్నర్ ఆరెంజ్ మెంట్ లను చూసి కూడా తనలో ఏ భావం లేదు…పొడి పొడి గా మాట్లాడుతూ..నన్ను పట్టించుకోకుండా నిద్ర పోయింది…

తర్వాత మరుసటి రోజు …తన ప్రెగ్నెన్సీ గురించి అడిగాను…అలాంటిది ఏమీ లేదని చెప్పింది….వారం తర్వాత..తన బీరువా లో అబార్షన్ కు ఉపయోగించే టాబ్లెట్స్ చూసాను….నిలదీశాను…ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవే అయింది…..వైషూ చాలా సీరియస్ అయింది…ఆ రోజు సాయంత్రం తను లగేజ్ సర్దుకుని .. వాళ్ళ అమ్మ గారింటికి వెళ్లిపోయింది…..

నాక్కూడా కోపం వచ్చింది…అంతే తర్వాత తను బెంగళూరు కు రాలేదు…చూస్తుండగానే నెల రోజులు గడిచాయి..నేనే ఫోన్ చేశాను…తను మాట్లాడలేదు…అప్పటికే మా ఇంట్లో…” ఆ పిల్ల నే కావాలి అని పెళ్లి చేసుకున్నావు…ఇప్పుడు అనుభవించు” అంటూ మాటలు..,ఇక నేనే వైషూ వాళ్ళింటికి వెళ్ళాను…అక్కడ మాటా మాటా పెరిగి..వైషూ పై చేయి చేసుకున్నాను..

అంతే వైషూ తండ్రి..నన్ను కొట్టాడు…ఆవేశం పెరిగిపోయి..ఇక వైషూ నాకు వద్దు అంటూ గొడవ చేసి మా..ఇంటికి వచ్చేసాను….ఇక అప్పటి నుండి…ఇద్దరం దాదాపు ఆరు సంవత్సరాల నుండి విడిగానే ఉంటున్నాము….ఇంట్లో..వైషూ కు విడాకులు ఇచ్చి…ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి…నిజానికి..నాకు ఎప్పటికీ వైషూ కావాలి..తను తన బాధ్యతల కోసం నాకు దూరంగా ఉంది..అంతే.. కానీ నా పై ప్రేమ లేక కాదు

నిజానికి వైషూ కుటుంబం…ఆర్థిక సమస్యల్లో వుంది…పెళ్లికి ముందు వైషూ కుటుంబానికి వైషూ జీతం ఒక ఆర్థిక ఆధారం..ఇంకా పెళ్లి కావలసిన చెల్లి…డిగ్రీ..ఇంటర్ చదువుతున్న తమ్ముడు వున్నాడు…వారిని చదివించి..సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది…పెళ్లి తర్వాత కూడా..తన చెల్లి..తమ్ముళ్ళ బాధ్యతల్లో భాగస్వామ్యం కావచ్చు అనుకుంది….కానీ…పెళ్లి తర్వాత అత్తింటి బాధ్యతలు పెరిగాయి…పుట్టింట్లో ఆర్థిక సమస్యలు పెరిగాయి…

అందుకే పిల్లలు ఇప్పట్లో వద్దనుకుంది..ఆ విషయాన్ని నాకు తెలియకుండా దాచి…చిన్న చిన్న గొడవలు చిలికి .చిలికి గాలి వాన లా మార్చింది….తన వైపు నుండి ఆలోచించకుండా తప్పు చేశాను అనిపించింది..అందుకే నా తప్పు తెలుసుకుని..క్షమాపణలు కోరదామని వెళ్తున్నాను…బస్ ఆగింది…వైషూ వెళ్తోంది…తన వెనుక నే నేను కూడా…వైషూ వాళ్ళింట్లో కి వెళ్ళగానే..నేను కూడా అడుగుపెట్టాను…వాళ్ళింట్లో ఆశ్చర్యం..నన్ను చూడగానే…నేనే కల్పించుకుని ..మా అత్తయ్య..మామ గార్లతో నవ్వుతూ పలకరించా …వాళ్ళు కూడా..జరిగిందంతా మరచిపోయి..సంతోషంగా పలకరించారు…

వైషూ లో మాత్రం ఇంకా కోపం పోయినట్లు లేదు…ముభావంగా నే వుంది..త్వరగా స్నానం చేసి..అత్తగారు వడ్డించిన వేడి భోజనం తిని…వైషూ గది లోకి అడుగుపెట్టాను…వైషూ మంచం పై కూర్చుని ఉంది…వెళ్లి దగ్గరగా కూర్చున్నా…తన చేతి ని నా చేతిలోకి తీసుకుని… సారి..అన్నాను…దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నా స్పర్శ…తన మనసులోని భారమంతా కరిగి కన్నీరయింది….చెప్పడం మొదలు పెట్టా…

” ఎలా ఉన్నావ్ఇప్పటి తో నీ త్యాగాల పర్వం ముగిసిందా వైషూ….చెల్లికి పెళ్లి చేసేసావ్…తమ్ముళ్లు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరారు..ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు…ఇక మనం మన ఇంటికి వెళ్ళిపో దాం…….నువ్వు లేకుండా బ్రతకడం కష్టం..రేపే మన ప్రయాణం “అన్నాను…కన్నీటి తో..గుండె నిండా ప్రేమ తో అల్లుకుపోయింది.మరలా మా జీవన ప్రయాణం అరమరికలు లేకుండా మొదలైంది…

నిజానికి ఇప్పట్లో చిన్న చిన్న కారణాల కే విడిపోతున్న జంటల ను చూస్తున్నాం. అలాంటిది చిన్న విషయాల కే ..పరిపక్వత లేని గొడవలు పడి..విడిపోయి..తర్వాత కుటుంబ బాధ్యతలు తీర్చుకుని..తప్పు తెలుసుకుని…ఆరు సంవత్సరాల తర్వాత కూడా..అహం ను వదిలి..భార్య భర్త..కలిసిపోవడం…కూడా..ఒక మంచి మార్పు…సమస్యలు..అపార్థాలు లేని కాపురాలు ఉండక పోవచ్చు.. కానీ..సరిదిద్దుకోవటం…సర్దుబాటు చేసుకోవడం లో నే ఉంది అసలైన సమర్థతసమాప్తం.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
2
+1
0
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks