Menu Close

మీ ప్రజలు అమ్మడుపోయే వాళ్ళు – Thought Provoking Stories

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మీ ప్రజలు అమ్మడుపోయే వాళ్ళు – Thought Provoking Stories

ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో… దొంగలు తుపాకీలు చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వారిని బెదిరించారు.. ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది, కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి. కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకుని పోతాం అని చెప్పారు. “మనసు మార్చే మాటలంటే ఇవే”

దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు. “దీన్నే అంటారు చేసే పనిలో నిమగ్నత అవసరం అని”

దొంగలు దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అందులో ఒక దొంగ డబ్బును లెక్కపెడదామని చెప్పడంతో అందులో ఒకడు ఎందుకు ఎంత డబ్బు పోయిందన్నది ప్రభుత్వమే ప్రకటిస్తుందిలే అన్నాడు. “దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని”

బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల కన్నా ముందు అతని పైఅధికారికి చెప్పగా… బ్యాంకులో దొంగతనం జరిగింది మొత్తం రూ.20 కోట్లు. మనం ఇంకో రూ.30 కోట్లు పంచుకుని మొత్తం రూ.50 కోట్లు చోరీ అయిందని చెబుదాం అన్నాడా అధికారి.! “దీన్నే అంటారు అసందర్భాన్ని కూడా మనకు ఉపయోగకరంగా (అవకాశంగా) మార్చుకోవడం అని”

ఇది విన్న ఒక అధికారి ఏటా ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు మనసులో. “ఇదే స్వార్థం అంటే”

మరుసటి రోజు షాక్ దొంగతనం జరిగిన ￰మర్నాడు వార్తల్లో… బ్యాంకులో రూ.100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆ ముఖ్యమంత్రి వాటా రూ.50 కోట్లన్నమాట. ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బుని లెక్కపెట్టారు. మొత్తం రూ.20 కోట్లు ఉన్నట్టు తేలింది.అదేంటి మనం రూ.20 కోట్లు దొంగతనం చేస్తే మిగిలిన రూ.80 కోట్లు ఎవరు దొంగతనం చేశారని వారు ఆశ్చర్యపోయారు.!

దొంగలకి విషయం అర్థం అయింది, దొంగల్లో ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి రూ.20 కోట్లు దొంగతనం చేస్తే, వీళ్లు మాత్రం దొరల్లా రూ.80 కోట్లు దోచేసుకున్నారు అని. “చదువు అవసరం ఇప్పుడు తెలిసింది” అని అన్నాడు. మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది.

ఒక రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పుడు ఎంపీ కృపాలాని ఎదురై ఇలా అన్నారట.

ambedkar

కృపాలాని: ఏంటి అంబేడ్కర్ ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి.?

అంబేడ్కర్: ఈ భారతదేశంలో రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టటం చూశాం. కానీ నేను రాణుల కడుపులో నుంచి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టె నుంచి రాజులు పుట్టేలా ఏర్పాటు చేశాను.. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.

కృపాలాని: అయితే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు.. ఎందుకంటే నీ ప్రజలు పేదవారు, నిస్సహాయులు, అడుక్కునే వాళ్లు, అమ్మడుపోయే వాళ్ళు.. మేము వారి ఓట్లు కొని మా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును దోచుకుని వాళ్లను బిచ్చగాళ్లను చేస్తాం, నువ్ ఏమీ చేయలేవు.

అంబేడ్కర్: నా ప్రజలు పేదలే, నిస్సాహయులే, అడుక్కునే వారే, అమ్ముడుపోయే వారే.. వారి ఓట్లను కొని మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు.. కానీ, ఏ రోజయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్లు ఎవరు ఉండరు, అది గుర్తుంచుకోండి అన్నారు బాబాసాహెబ్.

ఇది కథ కాదు.. జరిగిన సంఘటన. నీ ఓటు విలువ నువ్వు గుర్తించే వరకూ ఈ అవినీతిపరుల చేతుల్లో బలవుతూ ఉండాల్సిందే .

చాలా మందికి కనువిప్పు కలిగించే కథ – Emotional Story in Telugu

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading