అర్జునుడు కృష్ణుడి మీద చిరాకు పడ్డ క్షణం..తప్పకుండా చదవండి. - Telugu Bucket
Menu Close

అర్జునుడు కృష్ణుడి మీద చిరాకు పడ్డ క్షణం..తప్పకుండా చదవండి.

యుద్ధం ముగిసింది.. అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది… కృష్ణుడు అర్జనుడిని ఓరకంట చూస్తూ “దిగు పార్ధా” అన్నాడు. పార్ధుడు మొహం చిట్లించాడు.. చికాకుపడ్డాడు..

ఆనవాయితి ప్రకారం ముందుగా సారధి దిగి రధం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు…….. దానికి విరుద్ధంగా ముందు సారధి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడి అహం దెబ్బతింది, ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక… అర్జునుడు రధం దిగుతాడు. అర్జనుడు దిగి కొంతదూరం వెళ్ళాక కృష్ణుడు ఆ రధం నుండి దిగుతాడు, కృష్ణుడు ఆ రధం నుండి దిగిన మరునిముషంలోనే రధం భగ్గున మండి బూడిద అయింది…

అదిరిపడ్డాడు అర్జనుడు… యుద్ధం లో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి వాటిని తన శక్తి ద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు ఆయన దిగగానే శక్తి విడుదలై రధం మండిపోయింది…

అదే ముందు కృష్ణుడు రధం దిగిఉంటె…..?

అలానే మానవారి నుండి కొన్ని మాటలు, చేతలు మనల్ని నొప్పించే విదంగా వుంటాయి అంత మాత్రాన అవి మనకి చెడు కలిగించేవి కాదు, మనకి మంచి చెయ్యాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడి వుంటారు లేదా చేసి వుంటారు అని అర్దం చేసుకోవాలి. అంటే కానీ అపార్దం చేసుకోకూడదు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading