Menu Close

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో-Telugu Poetry

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మురుగు ఆల్చిప్పలో ముత్యమట
మెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట

మచ్చడిన చందమామెంత అందమట
బురద కన్న కమలముకెందుకంత సొగసట

మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమట
గొంగళి పురుగు తోలు వదలగ సీతాకోక చిలుకట

పొగమంచు ముద్ద చల్లగాలికి చినుకై జారి పారునట
ఆకాశానికి అందమైన రంగట, అది మన కంటికి బ్రమట

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో.

సురేష్ సారిక

మరిన్ని అందమైన కవితలు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading