మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు, కానీ భయపడుతూ బతకాలి-Telugu Stories - Telugu Bucket
Menu Close

మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు, కానీ భయపడుతూ బతకాలి-Telugu Stories

Latest Telugu Stories, Best Telugu Stories, Telugu Stories for Children, Telugu Kathalu, Telugu Kadhalu

ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయడం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకుంటాడు, ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కుని ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటి పనిమనిషిని పిలిచి ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు, యజమాని చెప్పినట్టే ఆ పనిమనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది.

అది తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు అతను సంచి తీసి చూడగా నవరత్నాలు ధగధగా మెరిసిపోతున్నాయి. ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అన్నాడు ఆ పనివాడు అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకామేశమే లేదు మీరే ఉంచేసుకోండి అని చెప్పాడు. మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా అన్నప్పుడు నేను మీరు నమ్మినా బంటును అయ్యా మిమ్మల్ని మోసం చేయలేను అన్నాడు.

నువ్వే నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసంచేసుకోను అన్నాడు ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు అతను సంతోషంతో స్వాగతించి మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను మీకు కావలసినన్ని రత్నాలు తీసుకోండి అన్నాడు.

మీకు ఇచ్చే ముందే రెండు రత్నాలను తీసుకున్నాను అన్నాడు ఈ వ్యక్తి సంచిని రత్నాలను లెక్కపెట్టాడు ఆ రత్నాల యజమాని అన్నీ రత్నాలు ఉన్నాయి ఒక్కటికూడా తగ్గలేదు అన్నాడు అందుకు ఇతను నా రెండు రత్నాలు నా నిజాయితీ నా ఆత్మగౌరవం అన్నాడు.

మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు, కానీ భయపడుతూ బతకాలి. నిజాయితితో సంపాదిస్తే ఆ ధైర్యమే వేరు.

మనుషులం మనుషులగా బ్రతుకుదాం.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Subscribe for latest updates

Loading