రెండో అభిప్రాయం తప్పనిసరి – Telugu Moral Stories – మోరల్ స్టోరీస్
జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా మనకి తెలియని పని ఏదైనా చేస్తున్నప్పుడు దాని గురించి ఇద్దరు ముగ్గురు దగ్గర అడిగి తెలుసుకోండి కనీసం రెండు మూడు అభిప్రాయాలూ తీసుకోవడం చాలా మంచిది, ఎందుకో ఈ కథ పూర్తిగా వింటే మీకే అర్దం అవుతుంది.
నాకు ఉహ తెలిసినప్పటి నుండి నా మంచం కింద రాత్రిళ్ళు ఎవరో ఉన్నారనే భయం ఉండేది. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాను. “సార్… రాత్రిళ్ళు మంచం మీద పడుకోగానే నా మంచం కింద ఎవరో ఉన్నారనిపించి భయమేసి, అస్సలు నిధ్ర పట్టడం లేదు. సరిగ్గా నిద్రలేక పిచ్చెక్కిపోతుంది.”
అంతా విన్న ఆ సైకియాట్రిస్ట్ “మీరేం భయపడకండి ! మీ సమస్యను నేను తీరుస్తాను. వారానికి మూడు రోజులు నా దగ్గరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సంవత్సరంలోగా మీ భయాలన్నీ పటాపంచలై పోతాయి. అని “భరోసా ఇచ్చాడు సైకియాటిస్ట్.
”సార్….. మీరెంత ఫీజు తీసుకుంటారు!!” అని అడిగాడు ఆ వ్యక్తి. వచ్చిన ప్రతిసారీ ₹500/- ఛార్జి చేస్తాను.” అన్నాడు డాక్టర్. సరే అని ఇంటికి వెళ్లాడు ఆ వ్యక్తి.
ఆర్నెల్ల తర్వాత ఒక రోజు దారిలో డాక్టర్ కి ఆ వ్యక్తి కనబడ్డాడు. “ఏం… ట్రీట్మెంట్ కు ఎందుకు రాలేదు.” అని అడిగాడు. “రోజుకు ₹500/-, వారానికి ₹1500/- చొప్పున సంవత్సరానికి ₹81000/- అవుతోంది. ఒకరోజు బార్ లో సర్వ్ చేసేవాడు యాభై రూపాయలకే నా సమస్యను నయం చేసాడు అన్నాడు.” “ఔనా!!! అదెలాగా!!”..? “మంచం తీసేసి కింద పరుపు వేసుకుని పడుకో.. అప్పుడు దాని కిందికి ఎవ్వరూ రారు.” అని చెప్పాడు.
సమస్య పెద్దగా అనిపించినా దానికి పరిష్కారం చాలా చిన్నగా వుంది కదా.. అందుకే కొన్ని కొన్ని విషియాలలో రెండో అభిప్రాయం తీసుకోవడం చాలా మంచిది. ఏమంటారు.. ?
అతి తక్కువ ప్రైస్ లో ఆన్ని బ్రాండెడ్ AC లు ఒకసారి చూసి కంపేర్ చేసుకుని అప్పుడే తీసుకోండి.