జీవితానికి ఉపయోగపడే టాప్ 35 కోట్స్ – బెస్ట్ లైఫ్ కోట్స్
- జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. అందుకే ఆశలు తగ్గించుకుని, జీవితం ఎలా నడుస్తుందో అలా వెళ్లాలి.
- నీ మనసులో ఉన జెలసీ, కోపం తగ్గించు. వాటివల్ల నీకు దక్కాల్సిన లాభం దక్కదు
- నీకు అండగా నిలిచే, సహాయం చేసే స్త్రీని మాత్రమే ప్రేమించు.
- విజయవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఒకే ఒక నియమాన్ని పాటించు – నీకు నీవు అబద్ధం చెప్పుకోవద్దు.
- నీ తల్లిదండ్రులు నీమీద ఆధారపడితే వారి అవసరంతో మాత్రం ఆడుకోవద్దు.

- వ్యక్తులను కాదురా, లక్ష్యాలను అనుసరించు.
- నీ 20వ పుట్టిన రోజు వరకూ స్వార్థం తోనే ఉండాలి, నీ జీవితం కోసం నువ్వే పోరాడు
- వదిలేయడానికి చాలా గొప్ప శక్తి కావాలి, నీ మనశ్శాంతికి అడ్డం నిలిచే దాన్ని వదిలేయి.
- నీ మాటలు నీమౌనం కన్నా అందంగా ఉంటేనే మాట్లాడు.
- నీ రూపాన్ని మెరుగుపరుచుకో. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. బాగుంటే, మనసు కూడా హాయిగా ఉంటుంది. డబ్బుల్లేవని ఎలా పడితే అలా ఉండొద్దు.
- కొంతమంది నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు, ఎందుకంటే వారి జీవితం సరిగ్గా సాగడం లేదు కాబట్టి.
- మంచివాళ్లను అందరూ ప్రేమించరు, కానీ ఎక్కువగా ఉపయోగించుకుంటారు.
- మనుషులను వదిలేయడానికి భయపడకు, ఇలాంటి వారిని సంతోషపెట్టే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోవడం ఖాయం
- నీ ఆలోచనలను రహస్యంగా ఉంచుకో. పని పూర్తయ్యే వరకు బయటపెట్టకు. ముందుగా చెప్పడం అపశకునం లాంటిదే
- మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అతిగా/ఎక్కువగా ప్రేమించవద్దు. ఒంటరిగా ఉన్నావని పెళ్లి మాత్రం చేసుకోవద్దు.
- నీ ఆలోచనలు శక్తివంతమైనవి, అవి సానుకూలంగా ఉండేలా చూసుకో.
- సోషల్ మీడియా వల్ల అసలు కనికరించాల్సిన మంచి వ్యక్తిని కూడా అసూయతో చూస్తావు.
- పుట్టినరోజుకి ఎవ్వరూ నీకు బహుమానాలు ఇవ్వరు, కష్టపడి సంపాదించు, నీకు నువ్వే బహుమతులిచ్చుకో.
- భయపడుతూ వెనుకడుగు వేయకు, ఎందుకంటే అదే నీ జీవితాన్ని మార్చే నిర్ణయం కావొచ్చు.
- త్వరపడుతూ, పొరపడుతూ నీ అభివృద్ధిని చెడగొట్టుకోవద్దు.
- ఎంత దాహంగా ఉన్నా, కొందరిని నీరు అడగకూడదు. తిండి విషయంలో కూడా కొందరు పిలిస్తే పోకూడదు.
- నీ జీవితానికి విలువ జోడించు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో.
- ఎవరినైనా ప్రేమించు, కానీ ప్రేమ కోసం నీ గౌరవాన్ని పోగొట్టుకోకు.
- నీవే నీకు అసలైన మిత్రుడు. ఎప్పుడూ నిన్ను నువ్వు అవమానించుకోకు.
- కొందరు నీ జీవితంలోనికి తిరిగి రావడం అంటే నువ్వు ఇంకా మూర్ఖుడిలాగే ఉన్నావా అని పరీక్షించడానికి మాత్రమే.
- నీ జీవితంలో అవసరంలేని వారిని దూరంగా పంపించు, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
- పెద్ద కలలు కను, కానీ చిన్న చిన్న పనులతో మొదలు పెట్టు. స్థిరంగా ఉండి, ఎదుగుతూ వెళ్లు.
- ఇతరులకు దానం/ఖర్చు చేయడానికి ముందు నీ కుటుంబం పరిస్థితి చూసుకో.
- తేలికగా వచ్చినది ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడేది తేలికగా రాదు.
- నీ వ్యక్తిగత జీవితంపై అధికంగా ప్రశ్నలు వేసే వారికి తప్పు సమాచారం ఇవ్వడం అలవాటు చేసుకో.
- మోసం చేసిన వ్యక్తులను మళ్లీ మళ్లీ నమ్మకు.
- కొందరు మాజీ ప్రేమికులు ఇప్పుడు జీవితంలో ఎంత ఎదిగినప్పటికీ, వాళ్లను వదిలేసినందుకు అసలు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వే కరెక్ట్.
- స్నేహితుల ఒత్తిడికి లోనవద్దు.
- మహిళలను వేధించవద్దు, గౌరవించు.
- పని చేసే ప్రదేశంలో అందరూ నీ స్నేహితులు కాదు. నీ పని మాత్రం నువ్వు హాయిగా చేసుకో.
35 Best Quotes in Telugu for Life.
Like and Share
+1
2
+1
+1