Telugu Moral Stories
Inspiring Telugu Stories
Moral Stories in Telugu
ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు .
దాని మీద ప్రజల అభిప్రాయం కూడా
తెలుసుకోవాలి అనుకున్నాడు .
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు .
దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
“నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది.
ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు.
ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక “ఇంటూ” మార్కు పెట్టండి అని అందులో ఉంది .
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు.
అతడికి ఏడుపు వచ్చేసింది. దాని నిండా “ఇంటూలే ” ఖాళీ లేదు .
ఏడుస్తూ తనకు ఆర్ట్ నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు.
“నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను
అని నాకు తెలిసి పోయింది” అంటూ విచారించాడు .
అప్పుడు మాస్టారు అతడిని ఓదార్చి …..
అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు.
మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు.
ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు.
దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు.
“నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది.
ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు.
ఎక్కడ లోపం ఉందో అక్కడ క్రింద నేను పెట్టిన రంగులు,
బ్రష్ లతో దానిని సరి చెయ్యండి” అని ఆ నోటీసులో ఉంది .
విచ్చిత్రంగా వారం రోజులు అయినా ఒక్కరూ
దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
ఎందుకలా జరిగింది ?
అనుకొంటూ అతను మళ్ళీ మాస్టార్ దగ్గరికెళ్ళి జరిగింది చెప్పడంతో ….
మాస్టారు అతనికి ఇలా చెప్పడం జరిగింది…
“ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక.
సరి చెయ్యడం చాలా కష్టం” అని. ….!!
కాబట్టి ఒకరి జీవితాన్ని విమర్శించి,
తప్పులు వెతగడం అందరికి చాలా తేలిక.
కానీ అదే ఒకరి జీవితాన్ని సరిచేయడము మాత్రం చేతకాదు ఎవ్వరికి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu
Love Stories in Telugu
Prema Kathalu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.