Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

యువతి బాధతో ఏడుస్తుంటే, అందరూ ఆనందించడం నాకు నచ్చలేదు – Heart Touching Stories in Telugu

Heart Touching Stories in Telugu

Heart Touching Stories in Telugu

Heart Touching Stories in Telugu

చిత్రకళా ప్రదర్శన ‘ జరుగుతున్న హాల్లో ఒక మూలగా నిలబడి
హాల్లో అందంగా అలంకరించిన చిత్రాలను, వస్తూ పోతూ ఉన్న సందర్శకులను చూస్తూ
ఆ అందమైన సాయంకాలాన్ని ఆనందిస్తున్నాడు అభినవ్.
అతడికి చిత్రకళలో కొంచెం ప్రవేశం ఉంది.

ఎప్పుడో వీలునిబట్టి ఇటువంటి ప్రదర్శనలకి హాజరయి, చిత్రకళలో మెలకువలు,
క్రొత్త ధోరణులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.

హఠాత్తుగా ఒక చిత్రం అతడిని ఆకర్షించింది.
ఆ చిత్రంలో ఒక అందమైన యువతి విశాలమైన నేత్రాలు,
గులాబీరంగు చెక్కిళ్ళపై జాలువారుతున్న మంచిముత్యాల వంటి కన్నీటి బిందువులు.
ఆ చిత్రం చాలా సహజంగా, నేర్పుగా చిత్రీకరించాడు ఆ చిత్రకారుడు.
కపోలాలపై జాలువారుతున్న కన్నీటి బిందువులు నిజమైన కన్నీరులా కనిపిస్తుంటే,
ఆ చిత్రకారుడిని అభినందించుదామని అనిపించింది.

ఆ చిత్రం ప్రక్కనే నిలబడి ఉన్నాడతను.
సన్నగా,పొడవుగా చామనఛాయలో, అభివ్యక్తీకరించే విశాలనేత్రాలు,
పైకి ఎగదువ్విన వతైన జుట్టుతో కళాకారుడని
చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తున్న ఆ యువకుడిని కలవడానికి రెండడుగులు వేశాడో లేదో ,
ఆహా,ఈ చిత్రం ఎంత బాగుంది.
ఆ కన్నీటి బిందువులు చూశారా, ఎంత సహజంగా కనిపిస్తున్నవో..

ఇద్దరు నడివయస్క పురుషులు అక్కడికి వచ్చి, ఆ యువతి చిత్రాన్ని ప్రశంసించసాగారు.
సార్, మీరేనా ఈ చిత్రాన్ని ఇంత అద్భతంగా చిత్రించిన వారు.
మీకు నా ధన్యవాదాలు. అంటూ అతడితో చేయికలిపారు.
వారి వేషభాషలు చూస్తే బాగా ధనికులై ఉంటారనిపించింది.

ఈ వీపింగ్ లేడీ’ ని చూస్తుంటే వదిలిపెట్ట బుద్ధవడంలేదు.
మీరెంత ధర చెప్తే అంతకి కొనాలని అనుకుంటున్నాను’
వారిద్దరిలో కొంచెం ఎత్తుగా, లావుగా గిరజాల జుట్టున్న వ్యక్తి విలాసంగా అడిగాడు.
ఎంత ధర చెప్తాడోనని ఆ వ్యక్తులతో పాటు ,అభినవ్ కూడా ఆత్రుతగా చూశాడు.

ఒక నిముషం ఆ చిత్రకారుడు మాట్లాడలేదు.
తరువాత సరే, చిత్రం ధర చెప్తాగానీ, ఒక్క నిముషం’ అంటూ దగ్గర ఉన్న బ్రష్ తో
యువతి చెక్కిళ్ళపై జారుతున్న కన్నీటి బిందువులు చెరిపివేయసాగాడు.
అరే, మీరేం చేస్తున్నారు. ఈ చిత్రంలో అసలు ఆకర్షణ ఆ కన్నీరే…
వాళ్ళు ఆశ్చర్యంగా అతడి ని వారించారు.
చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నాను ‘అంటూ కన్నీరంతా చెరిపివేశాడు.

ఇక్కడ చాలామంది ఈ కన్నీరు కారుస్తున్న యువతిని చూసి
మంత్రముగ్ధులవడం చూసి, చూసి నా తప్పు తెలిసివచ్చింది.
యువతి బాధతో ఏడుస్తుంటే, అందరూ ఆనందించడం నాకు నచ్చలేదు.
ఇంక ఈ యువతి కన్నీరు కార్చదు…
చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ చిత్రకారుడు.
మరి. ఇప్పుడుధర ఎంత… ఈసారి అడగడం అభినవ్ వంతు.

ఊహూ, ఈ చిత్రానికి వెల అమూల్యం.
ఇది ఇంక అమ్మబడదు’ నవ్వుతూ చెప్పాడా చిత్రకారుడు.

Heart Touching Stories in Telugu

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Telugu Moral Stories
Inspiring Telugu Stories
Motivational Stories
Pitta Kathalu, Neethi Kathalu
Moral Stories in Telugu

Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu

Love Stories in Telugu
Prema Kathalu

Like and Share
+1
3
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks