Menu Close

Telugu Moral Stories


Telugu Moral Stories

ఒకప్పుడు ఒక ఎండ్రకాయ సముద్రపు ఒడ్డున వయ్యారంగా ఇసుకలో నడుస్తూ దాని కాలి అడుగుల గుర్తులు చూసుకొని మురిసిపోయింది. ఎంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది. అంతలో ఒక అల వచ్చి ఆ అడుగుల ముద్రలను తుడిచేస్తూ వెళ్లి పోయింది.

ఎండ్రకాయ సముద్రాన్ని చూసి, ” నీవు నా మంచి స్నేహితుడివని అనుకున్నాను! .. నీ అలల తాకిడికి నా అందమైన పాదముద్రలు చెరిగి పోయాయి. ఇదేమన్నా బాగుందా!!” అని నిష్టూరంగా పలికింది. దానికి సముద్రం, ” పిచ్చిదానా ! నీ అడుగుల వెంబడి నిన్ను పట్టుకోవడానికి వెతుక్కుంటూ ఒక జాలరి వస్తున్నాడు. అది చూసి నిన్ను రక్షిద్దామని నీ అడుగుల ముద్రలు చెరిపేసాను. అంతే.”

మనం సాధారణంగా, ఒక్కొక్కరిని చూసి ఒక్కో అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటాం. రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇతరులు చర్యలను అర్థం చేసుకోకుండా, వారి చర్యలపై తీర్మానాలు చెయ్యడం ఆ అంత మంచి పని కాదేమో !! – ఒక వ్యక్తి మీద మన అభిప్రాయం చెప్పడమంటే అతనెవరో తెలియజేయడం కాదు, నిజానికి ఆ తీర్పు మనమెవరో, ఏమిటో తెలియజేస్తుంది.

Telugu Moral Stories

Share with your friends & family
Posted in Telugu Stories

Subscribe for latest updates

Loading