Telugu Moral Stories
ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు ఇది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు.
నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య. అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నారు.
అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది నీకు తెలుసా అన్నారు తాతయ్య.. అవునా ఏంటో అవి చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు.
నువ్వు అద్దంలో కి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటె అంతే చూపెడుతుందిగా అన్నారు. అవును అన్నాడు ఆ యువకుడు ఎక్కువగానో తక్కువగానే చూపదుగా అన్నారు.
అవును తాతయ్య అన్నాడు అద్దం లాగ నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం. తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతే కానీ ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు ఇది మొదటి పాఠం.
అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది నువ్వు లేకపోతే నువ్వు చూపెట్టదు అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం ఇది రెండవ పాఠం అన్నారు.
అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో పగలకొట్టము కదా అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా అవి సరిచేసుకోవాలి అని చెబుతుంది ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య
ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అని ఆనందంతో అక్కడనుండి వెళ్ళాడు.
Telugu Moral Stories
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.