ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
తండ్రి, అతని పదేళ్ల కూతురితో ఒక వంతెన దాటుతున్నాడు. తండ్రి ఆందోళనగా, “తల్లీ! నా చెయ్యి గట్టిగా పట్టుకో అమ్మా ! నీళ్లల్లో పడిపోకుండా ఉంటావ్!” అని హెచ్చరించాడు. “ఒద్దు నాన్నా, నువ్వేనా చెయ్యి పట్టుకో!” “తేడా ఏముందమ్మా!” తండ్రి ఆశ్చర్యంగా అడిగాడు”
చాలా పెద్ద వ్యత్యాసం ఉంది నాన్నా! నేను నీ చెయ్యి పట్టుకుంటే, అనుకోకుండా ఏదైనా జరిగితే నీ చెయ్యి ఒదిలేయవచ్చు, అదే నువ్వు నా చెయ్యి పట్టుకుంటే
ఏం జరిగినా ఒదిలిపెట్టవు కదా!” ఏ బాంధవ్యంలో అయినా నమ్మకం అనేది, ఎవరు బాధ్యత తీసుకున్నారన్నది కాదు, ఎంత గట్టి బంధం ఏర్పరుచుకున్నారన్నది ముఖ్యం. అందుకే మీరు ప్రేమించే వ్యక్తి చెయ్యి, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా పట్టుకోండి, అంతేగానీ వాళ్ళే మీ చెయ్యి పట్టుకోవాలని కోరుకోకండి.
జీవితం యొక్క అందం మీరెంత ఆనందంగా ఉన్నారన్నదాని మీద ఆధారపడి ఉండదు. మీ బంధం, బాంధవ్యం వల్ల ఇతరులు ఎంత ఆనందంగా ఉన్నారన్నది ముఖ్యం.
సేకరణ – V V S Prasad